మరికల్, న్యూస్‌లైన్ : ట్రాక్టర్‌ను కారు ఢీకొన్న సంఘటనలో ఓ అయ్యప్ప భక్తుడు మృతి చెందాడు. గ్రామస్తుల కథనం ప్రకారం.. ధన్వాడ మండలం తీలేర్ కు చెందిన మెహన్‌రాజు (38) స్థానికంగా కిరాణా దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అయ్యప్ప మాల వేసుకున్నాడు.
మంగళవారం ఉదయం తన కారులో మహబూబ్‌నగర్‌కు వెళ్లాడు. అక్కడ కిరాణా సామగ్రిని కొనుగోలు చేసి అందులో తీసుకుని రాత్రి సుమారు 7.30 గంటలకు తిరుగు ప్రయాణమయ్యాడు. మార్గమధ్యంలోని లాల్‌కోటచౌరస్తా సమీపంలోకి చేరుకోగానే ముందు వెళుతున్న ట్రాక్టర్‌ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈనెల 27న శబరి యాత్రకు వెళ్లేందుకు సిద్ధం అవుతున్న క్రమంలోనే ఈ సంఘటన చోటుచేసుకోవడంతో కుంటుంబ సభ్యులు బోరున్నారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఏఎస్‌ఐ లక్ష్మీనారాయణ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కారు ఢీకొన్న సంఘటనలో..
పోలేపల్లి (బొంరాస్‌పేట) : అప్పుడే భోజనం చేసి కాసేపు ఇంటిముందున్న కట్టపై కూర్చున్న వృద్ధురాలిపైకి కారు దూసుకొచ్చి ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందింది. గ్రామస్తుల కథనం ప్రకారం... మంగళవారం మధ్యాహ్నం బొంరాస్‌పేట మండలం పోలేపల్లికి చెందిన కటకం పార్వతమ్మ (80) భోజనం చేసి తన ఇంటి ముందున్న అరుగుపై కూర్చుంది. అంతలోనే దామరగిద్ద మండలం అన్నాసాగర్‌కు చెందిన అంతారం హన్మంతు మద్యం మత్తులో కారు నడ పడంతో ఆమె పైనుంచి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఈ విషయమై మృతురాలి కుమారుడు కృష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఎస్‌ఐ లక్ష్మీనర్సిములు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకోగా వాహనాన్ని స్వాధీనపరుచుకున్నారు.
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం
Published Wed, Dec 25 2013 3:42 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement