విశాఖపట్నం: నాటు సారా స్థావరాలపై దాడులు నిర్వహించిన సీటీఎఫ్ అధికారులు 110 సారా ప్యాకెట్‌లను స్వాధీనం చేసుకున్నారు. విశాఖ నగరంలోని తగరపువలస జీరోపేటలో నాటు సారా విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనే సమాచారంతో శుక్రవారం రంగంలోకి దిగిన సీటీఎఫ్ బృందాలు సారా తయారీకి ఉపయోగించే బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. సారా విక్రయిస్తున్న ఆది లక్ష్మి, వెంకట లక్ష్మి అనే ఇద్దరిని అరెస్ట్ చేశారు.