గోకవరం/గంగవరం, న్యూస్‌లైన్ : గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారున పెట్రోల్ బంకు సమీపంలోని పంట కాలువలో బుధవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఓ మోటారుసైకిల్ కూడా లభించింది. ముందుగా కాలువలో మోటారుసైకిల్‌ను గుర్తించిన కొందరు వ్యక్తులు ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. గోకవరం ఎస్సై జీవీవీ నాగేశ్వరరావు, ట్రైనీ ఎస్సై వి.వెంకటేశ్వరరావు, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని కాలువలో గాలించారు. కాలువలో మోటారుసైకిల్‌తో పాటు రెండు మృతదేహాలు లభించాయి. అవి ఉమ్మెత్త గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి సమయంలో కొత్తపల్లి వైపు నుంచి జగ్గంపేట వైపు వెళుతుండగా ఈ ఏదైనా వాహనం ఢీకొట్టడంతో వీరు కాలువలో పడి మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు.
మృతులు వ్యవసాయ కూలీలు
మృతులు రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం ఉమ్మెత్తకు చెందిన మడికి వీరబాబు (23), గిన్నిపల్లి ఏసు (23)గా గుర్తించారు. వీరిద్దరూ వ్యవసాయ కూలీ లు.అవివాహితులు. మంగళవారం మోటారుసైకిల్‌పై గ్రామం నుంచి బయలుదేరారు.మడికి వీరబాబు తండ్రి గోకవరం ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మృతుడికి తల్లి, తమ్ముడు, చెల్లి ఉన్నారు.గిన్నిపల్లి ఏసుకు తండ్రి రాము, తల్లి తిరుపతమ్మ, తమ్ముడు, చెల్లి ఉన్నారు.
సంఘటనపై అనుమానాలు?
సంఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మెత్తలో మంగళవారం ఓ వివాహ వేడుక జరిగిందని, ఈ సందర్భంగా స్నేహితులిద్దరూ అతిగా మద్యం సేవించి ఉంటారని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ మత్తులో కొత్తపల్లికి వచ్చి తిరిగి తమ ఊరికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే మృతదేహాలు ఉన్న తీరును బట్టి వీరిని ఎవరైనా హత్య చేసి కాలువలో పడి వేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరు రోడ్డుకు ఎడమవైపు ప్రయాణం చేస్తుండగా కుడి వైపు ఉన్న పంట కాలువలో మృతదేహాలు, మోటారు సైకిల్ లభ్యమయ్యాయి. ఆ ప్రదేశంలో రోడ్డుపై ప్రమాదం జరిగినట్టు ఎలాం టి ఆనవాళ్లు కనిపించడం లేదు. సంఘటన స్థలాన్ని కోరుకొండ సీఐ ఎ.సన్యాసిరావు పరిశీలించారు. గోకవరం ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కాటన్ బ్యారేజ్ వద్ద మరో వ్యక్తి..
ధవళేశ్వరం : స్థానిక కాటన్ బ్యారేజ్ వద్ద నీటిలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. బ్యారేజ్ నాలుగో గేటు దిగువనీటిలో మృతదేహం ఉండడాన్ని గుర్తించిన స్థానికులు బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు సుమారు 55 ఏళ్లు ఉంటుందని భావిస్తు న్నారు. మృతదేహం ఒంటిపై నాచురంగు ప్యాంటు, నలుపు చొక్కా ఉంది. లోపల బనియన్‌పై గాయత్రీ సాంబ్రాణి స్టిక్స్ అనే పేరు ఉంది. మెడలో రుద్రాక్ష, వేంకటేశ్వరస్వామి, వినాయకుల లాకెట్లున్నాయి. మృత దేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశా రు. కాగా, మం గళవారం రాత్రి కొందరు ఈ మృతదేహన్ని బ్రిడ్జిపై నుంచి నీటిలో పడవేశారని స్థానిక మత్స్యకారులు పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది.
ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి
Published Thu, Dec 12 2013 2:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:29 AM
Advertisement
Advertisement