suspicious died
-
బీటెక్ విద్యార్థి అనుమానాస్పద మృతి
తాళ్లరేవు :యానాంకు చెందిన బీటెక్ విద్యార్థి సత్తి భీమేశ్వరరెడ్డి (24) అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. తాళ్లరేవు మండలం అరటికాయలంక వద్ద గౌతమీ గోదావరిలో అతని మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. యానాం గోపాల్ నగర్‌కు చెందిన భీమేశ్వరరెడ్డి స్థానిక రీజెన్సీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఆర్ఐటీ)లో ఇటీవలే బీటెక్ పూర్తి చేశాడు. ఎటువంటి ఉద్యోగం రాకపోవడంతో కొన్ని రోజులుగా మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అతను బుధవారం రాత్రి భోజనం చేసి బయటకు వెళ్లిపోయాడు. ఆ తర్వాత గురువారం ఉదయం అతని మృతదేహం లభ్యమైంది. దీంతో గోదావరిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నారు. అయితే భీమేశ్వరరెడ్డి మృతదేహం, అతని బైక్ లభ్యమైన ప్రాంతాలను బట్టి అతని మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతదేహం గోదావరిలో లభ్యమైనప్పటికీ బైక్ మాత్రం యానాం కనకాలపేటలోని కొబ్బరి తోటలో లభ్యమైంది. అక్కడకు వెళ్లాలంటే కొబ్బరితోటల్లోంచి వెళ్లాల్సి ఉంటుంది. ఆత్మహత్య చేసుకునేవాడే అయితే ప్రధాన రహదారి మీదుగా వెళ్లకుండా అంత మారుమూల ప్రాంతానికి ఎందుకు వెళ్లాడు, అక్కడకు ఒక్కడే వెళ్లాడా లేక ఎవరితోనైనా కలిసి వెళ్లాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆ ప్రాంతం మద్యం సేవించేందుకు అనుకూలంగా ఉండడంతో స్నేహితులతో కలిసి వెళ్లి ఉండవచ్చన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కోరంగి ఏఎస్సై ఆర్వీఎస్ఎన్ మూర్తి బృందం ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించింది. ఎస్సై ఆర్.ఆనంద్‌కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
బోథ్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని గుల్జార్ మైలా (14వ వార్డు) కాలనీకి చెందిన శైలజ ఉరఫ్ అయోషా ఫాతిమా(22) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బోథ్‌లోని గుల్జార్ మైలా కాలనీకి చెందిన మూగ యువకుడు తబ్రేశ్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లోని బధిరుల పాఠశాలలో చదివేవాడు. అదే పాఠశాలలో చదివే ఆదిలాబాద్ మండలం అంకోలికి చెందిన మూగ బాలిక శైలజతో ఏర్పడ్డ స్నేహం వారి మధ్య ప్రేమకు దారితీసింది. నిర్మల్ పోలీసుల సహకారంతో ఏడాదిన్నర క్రితం తబ్రేశ్, శైలజ పెళ్లి చేసుకున్నారు. అనంతరం శైలజ అయేషా ఫాతిమాగా పేరు మార్చుకుంది. ఈ పెళ్లి ఇష్టంలేని శైలజ కుటుంబ స భ్యులు తమ కూతురిని తమకు అప్పగించాలని అప్పట్లో మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఏడాదిన్నరపాటు శైలజ, తబ్రేశ్ల కాపురం సజావుగా సాగింది. నెలన్నర క్రితం శైలజ పాపకు జన్మనిచ్చింది. నాలుగు రోజుల క్రితమే ఆ పాపకు బారసాల నిర్వహించి ఉమ్మె హబీబాగా నామకరణం చేశారు. ఈ వేడుకలకు శైలజ తల్లి గంగమ్మ హాజరైంది. ఆమె శనివారం సైతం కూతురింటికి వెళ్లివచ్చింది. ఈ క్రమం లో ఆదివారం ఉదయం తబ్రేశ్ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అత్త మలాన్ మనవరాలి బట్టలు ఉతుకుతోంది. స్నానం చేసి ఇంట్లోకి వెళ్లిన శైలజ ఎంతకూ తలుపులు తీయలేదు. స్థానికుల సాయంతో తలుపులు పగులగొట్టి లోనికి వెళ్లగా దూలానికి శైలజ మృతదేహం వేలాడుతూ కనిపిం చింది. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటారుు. ఆమె మృతితో నెలన్నర వయసున్న చిన్నారి తల్లిప్రేమకు దూరమైంది. సీఐ మోహన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆదిలాబాద్ డీఎస్పీ లతామాధూరి చేరుకుని సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. కాగా, తన కూతురిని ఆమె అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శైలజ తల్లి గంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆపరేషన్ అరుున శైలజకు విశ్రాంతి అవసరమని, తనతో కూతురిని పంపాలని కోరినా ఆమె అత్తింటివారు పంపకుండా అన్యాయంగా పొట్టన బెట్టుకున్నారని కన్నీరుమున్నీరుగా విలపించింది. సంఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. గూడెంలో వృద్ధుడు.. దండేపల్లి : మండలంలోని గూడెం గ్రామానికి చెందిన దమ్మ నర్సయ్య(65) అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఎస్సై శ్రీని వాస్ కథనం ప్రకారం.. నర్సయ్య శనివారం ఎడ్లబండిపై చేను వద్దకు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి బయల్దేరగా రాత్రి వరకు చేరుకోలేదు. దీంతో కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లగా మార్గమధ్యంలో బండి చక్రం ఊడిపోయి కొంత దూరంలో తలకు గాయమై చనిపోరుున నర్సయ్య మృతదేహం కనిపించింది. ఆదివారం ఎస్సై సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నర్సయ్య మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తంచేశారు. వారి ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. కాగా, నర్సయ్యకు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. -
ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి
గోకవరం/గంగవరం, న్యూస్‌లైన్ : గోకవరం మండలం కొత్తపల్లి గ్రామ శివారున పెట్రోల్ బంకు సమీపంలోని పంట కాలువలో బుధవారం రెండు మృతదేహాలు లభ్యమయ్యాయి. వీటితో పాటు ఓ మోటారుసైకిల్ కూడా లభించింది. ముందుగా కాలువలో మోటారుసైకిల్‌ను గుర్తించిన కొందరు వ్యక్తులు ఆ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు. గోకవరం ఎస్సై జీవీవీ నాగేశ్వరరావు, ట్రైనీ ఎస్సై వి.వెంకటేశ్వరరావు, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకుని కాలువలో గాలించారు. కాలువలో మోటారుసైకిల్‌తో పాటు రెండు మృతదేహాలు లభించాయి. అవి ఉమ్మెత్త గ్రామానికి చెందిన యువకులుగా గుర్తించి వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి సమయంలో కొత్తపల్లి వైపు నుంచి జగ్గంపేట వైపు వెళుతుండగా ఈ ఏదైనా వాహనం ఢీకొట్టడంతో వీరు కాలువలో పడి మృతి చెందారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు వ్యవసాయ కూలీలు మృతులు రంపచోడవరం నియోజకవర్గంలోని గంగవరం మండలం ఉమ్మెత్తకు చెందిన మడికి వీరబాబు (23), గిన్నిపల్లి ఏసు (23)గా గుర్తించారు. వీరిద్దరూ వ్యవసాయ కూలీ లు.అవివాహితులు. మంగళవారం మోటారుసైకిల్‌పై గ్రామం నుంచి బయలుదేరారు.మడికి వీరబాబు తండ్రి గోకవరం ఆర్టీసీ బస్టాండ్‌లో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. మృతుడికి తల్లి, తమ్ముడు, చెల్లి ఉన్నారు.గిన్నిపల్లి ఏసుకు తండ్రి రాము, తల్లి తిరుపతమ్మ, తమ్ముడు, చెల్లి ఉన్నారు. సంఘటనపై అనుమానాలు? సంఘటనపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మెత్తలో మంగళవారం ఓ వివాహ వేడుక జరిగిందని, ఈ సందర్భంగా స్నేహితులిద్దరూ అతిగా మద్యం సేవించి ఉంటారని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఈ మత్తులో కొత్తపల్లికి వచ్చి తిరిగి తమ ఊరికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. అయితే మృతదేహాలు ఉన్న తీరును బట్టి వీరిని ఎవరైనా హత్య చేసి కాలువలో పడి వేశారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. వీరు రోడ్డుకు ఎడమవైపు ప్రయాణం చేస్తుండగా కుడి వైపు ఉన్న పంట కాలువలో మృతదేహాలు, మోటారు సైకిల్ లభ్యమయ్యాయి. ఆ ప్రదేశంలో రోడ్డుపై ప్రమాదం జరిగినట్టు ఎలాం టి ఆనవాళ్లు కనిపించడం లేదు. సంఘటన స్థలాన్ని కోరుకొండ సీఐ ఎ.సన్యాసిరావు పరిశీలించారు. గోకవరం ఎస్సై నాగేశ్వరరావు కేసు నమోదు చేసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాటన్ బ్యారేజ్ వద్ద మరో వ్యక్తి.. ధవళేశ్వరం : స్థానిక కాటన్ బ్యారేజ్ వద్ద నీటిలో గుర్తు తెలియని మృతదేహం లభించింది. బ్యారేజ్ నాలుగో గేటు దిగువనీటిలో మృతదేహం ఉండడాన్ని గుర్తించిన స్థానికులు బుధవారం ఉదయం పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి వయస్సు సుమారు 55 ఏళ్లు ఉంటుందని భావిస్తు న్నారు. మృతదేహం ఒంటిపై నాచురంగు ప్యాంటు, నలుపు చొక్కా ఉంది. లోపల బనియన్‌పై గాయత్రీ సాంబ్రాణి స్టిక్స్ అనే పేరు ఉంది. మెడలో రుద్రాక్ష, వేంకటేశ్వరస్వామి, వినాయకుల లాకెట్లున్నాయి. మృత దేహాన్ని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశా రు. కాగా, మం గళవారం రాత్రి కొందరు ఈ మృతదేహన్ని బ్రిడ్జిపై నుంచి నీటిలో పడవేశారని స్థానిక మత్స్యకారులు పేర్కొనడం అనుమానాలకు తావిస్తోంది.