
అమరావతి: ఉద్యోగాల భర్తీలో అక్రమాలపై నిరుద్యోగులు రాజధాని అమరావతిలో ఆందోళనకు దిగారు. తాడేపల్లి గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయం వద్ద నిరుద్యోగ యువకులు ధర్నా నిర్వహించారు. గిరిజనశాఖలో పోస్టుల భర్తీ, ప్రిన్సిపాల్ నియామకాల్లో అక్రమాలపై ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎంక్వైరీ వేయడం లేదని నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ఉన్నతాధికారి బదిలీ అయిపోయినా డీపీసీ మీటింగ్ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
గురుకులాల ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీల్లో కూడా భారీగా అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. కొత్త అధికారి జాయిన్ అయ్యే లోపు పోస్టులను బదిలీ అయిపోయిన అధికారి భర్తీ చేస్తున్నారని నిరుద్యోగులు వెల్లడించారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. పోస్టుల భర్తీకి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment