సాక్షి, నెల్లూరు : రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ జిల్లా వాసులు ఉద్యమ మంటలను మండిస్తూనే ఉన్నారు. సోమవారం నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఆయా జేఏసీలు సమైక్యంగా గర్జించాయి. ప్రభుత్వం జీతాలు ఇవ్వకపోయినా ప్రభుత్వ ఉద్యోగులు వెరవక ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు పోయేందుకు సర్వం సిద్ధం చేశారు. విద్యార్థులు, ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు, ఉపాధ్యాయులు, ఎన్‌జీఓలు, గెజిటెడ్ ఆఫీసర్లతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆందోళనలు ఉవ్వెత్తున కొనసాగిగించారు. ఉద్యమబాట పట్టిన ప్రజలకు వివిధ రాజకీయ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటిస్తూ ఆందోళనల్లో పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు పాల్పడిన పాలకులపై ఆగ్రహావేశాలు వెళ్లగక్కారు. సమైక్యాంధ్రను సాధిస్తామని నినదించారు. ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, నిరసన దీక్షలతో జిల్లా దద్దల్లింది.
ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. జనజీవనం స్తంభించి పోయింది. మొత్తంగా 34వ రోజూ జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగింది. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖను బాబు వెనక్కు తీసుకోవాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే వివేకానందరెడ్డి డిమాండ్ చేశారు. బాబు చేస్తున్నది ఆత్మ వంచనయాత్రగా అభివర్ణించారు. విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో వీఆర్‌సీ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి చిరంజీవి రాజీనామా చేయనందుకు నిరసనగా తుఫాన్ ఫ్లెక్సీలను తగులబెట్టారు. పొదలకూరు మండలం బిదరవోలు, మరుపూరు, సూరాయపాళెం గ్రామాల్లో సమైక్యవాదులు వంటావార్పు నిర్వహించారు. వింజమూరులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. సీతారామపురంలో ఉద్యోగ, ఉపాధ్యా య, పోరాట సమితి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి పిండప్రదానం నిర్వహించారు. సోని యా, కేసీఆర్ చిత్రపటాలకు పెళ్లి చేశారు. ఆటో కార్మికుల వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించి బస్టాండ్‌లో వంటా వార్పు చేశారు. దుత్తలూరు సెంటర్‌లో జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షల్లో ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. విశ్వతేజ పాఠశాల విద్యార్థులు 200 అడుగుల జాతీ య పతాకంతో మానవహారం ఏర్పాటు చేశా రు. బ్రహ్మేశ్వరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో వంటా వార్పు జరిగింది. కొండాపురంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పాఠశాలను మూసివేసి బస్టాండ్‌లో విద్యార్థులతో ఆట పాట కార్యక్రమం నిర్వహించారు. ఉదయగిరిలో వైఎస్సార్‌సీపీ, ఉపాధ్యాయ, ఉద్యోగ పోరాట సమితి ఆధ్వర్యంలో రిలేదీక్షలు జరిగాయి.
పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ర్యాలీ నిర్వహించి మానవహారం ఏర్పాటు చేశారు. వరికుంటపాడులో ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. కోవూరు ఎన్జీఓ హోంలో బలిజసంఘం నాయకులు దీక్షకు కూర్చున్నారు. ఇందుకూరుపేట మండల కార్యాలయంలో రెవెన్యూ అధికారులు దీక్షలో పాల్గొన్నారు. చిల్లకూరు మండలంలోని తీరప్రాంతంలోని తమ్మినపట్నం పంచాయతీలోని తమ్మినపట్నం, గుమ్మళ్లదిబ్బ, కొత్తూరు గ్రామాలకు చెందిన మత్స్యకారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, సముద్రంలో పడవలతో ప్రదర్శన నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. చిట్టమూరు మండలం మల్లాంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో మోటారు బైక్స్ ర్యాలీ నిర్వహించారు. చిట్టమూరులో రిలే నిరాహార దీక్షలు చేస్తున్న ఎన్జీఓలకు వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ వంకా రమణయ్య సంఘీభావం తెలిపారు. కావలిలో ట్రాక్టర్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండాచెట్టు సెంటర్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ట్రాక్టర్లతో ర్యాలీని నిర్వహించారు. వెంకటగిరి పట్టణ జేఏసీ ఆధ్వ ర్యంలో కాశీపేట సెంటర్ వద్ద మానవ హారం, నిరసనలు చేపట్టారు. సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త దబ్బల రాజారెడ్డి ఆధ్వర్యంలో రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. సూళ్లూరుపేట జేఏసీ ఆధ్వర్యంలో 20 రోజులుగా రిలే దీక్షలు కొనసాగుతున్నాయి. నాయుడుపేట ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలే దీక్ష, యూటీఎఫ్ ఆధ్వర్యంలో గాంధీమందిరం వద్ద రిలే దీక్షలు నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆత్మకూరు మున్సిపల్ బస్టాండ్ సెంటర్‌లో రిలే దీక్షలు నిర్వహించారు.
3
ఉవ్వెత్తున ఎగసిన సమైక్య ఉద్యమం
Published Tue, Sep 3 2013 5:53 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement