రెండో సారీ.. నిరాశే..! | Unsuccessfully Second time Engineering Admissions Second counseling | Sakshi
Sakshi News home page

రెండో సారీ.. నిరాశే..!

Published Sun, Jul 19 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 5:45 AM

Unsuccessfully Second time Engineering Admissions Second counseling

 విజయనగరం అర్బన్: ఇంజినీరింగ్ ప్రవేశాల రెండో కౌన్సెలింగ్ విషయంలో కూడా అభ్యర్థుల అంచనాలను తారుమారయ్యాయి. ఐఐటీ, ఎన్‌ఐటీ ప్రవేశాలకు జేఈఈ మెయిన్స్ రెండు కౌన్సెలింగ్‌లు పూర్తయ్యాయి కాబట్టి మొదటి వెయ్యిర్యాంక్‌ల అభ్యర్థులంతా ఎంసెట్ అలాట్‌మెంట్‌లు తిరస్కరిస్తారని.. దీంతో ఆంధ్రప్రదేశ్‌లోని ఇంజినీరింగ్ కళాశాలల్లో మొదటి వరస ర్యాంకర్లంతా భారీ సంఖ్యలో ఖాళీ చేస్తారని చాలా మంది భావించారు. కానీ అలా జరగకపోవడంతో ఎంసెట్ రెండో కౌన్సెలింగ్‌కి వెళ్లిన అభ్యర్థులకు  నిరాశ ఎదురైంది.  దీంతో రెండో కౌన్సెలింగ్ ప్రక్రియ వల్ల  అభ్యర్థులకు గానీ, కళాశాల యాజమాన్యాలకుగానీ   ప్రయోజనం లేకుండా పోయింది. ప్రధానంగా జేఈఈ మెయిన్స్, ఐఐటీ ప్రవేశాల కౌన్సెలింగ్ పూర్తికాకుండా ముందుగా ఎంసెట్ ప్రవేశాలు నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని అభ్యర్థులు వాపోతున్నారు. జేఈఈ మెయిన్స్‌లో అర్హతగల ర్యాంకర్లంతా దాదాపుగా ఎంసెట్ ప్రవేశ పరీక్షల్లో ముందువరస ర్యాంకుల్లో ఉంటారు. ముందుగా ప్రవేశ కౌన్సెలింగ్ జరిగిన ఎంసెట్ కళాశాలల అలాట్‌మెంట్స్ ఆన్‌లైన్‌లో తీసుకొని కళాశాలలో ప్రవేశించకుండా ఈఈ మెయిన్స్ కోసం నిరీక్షిస్తున్నారు. తాజాగా శనివారం విడుదల అయిన జేఈఈ మెయిన్స్ మూడో కౌన్సెలింగ్‌లో కూడా సీటు రాకపోయనప్పటికీ ఎంసెట్ అలాట్‌మెంట్లకు ఈ నెల 25వ తేదీ వరకు అవకాశం ఉండడం వల్ల అంతవరకు ఇటు ఎంసెట్ సీటు వదులుకోకుండా నిరీక్షిస్తున్నారు.
 
 దీంతో బెటర్ కళాశాలల ఖాళీ అవ్వడం లేదని మిగిలిన అభ్యర్థులు భావిస్తున్నారు. జేఈఈ మెయిన్స్ కౌన్సెలింగ్ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎంసెట్‌కి చివరి కౌన్సెలింగ్ పెట్టాలని అభ్యర్థులు కోరుతున్నారు. మరో వైపు ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యాలకు కూడా  మలి విడత అలాట్మెంట్  ప్రవేశాలు ఆశాజనకంగా లేవు. జిల్లాలోని ఏడు ఇంజినీరింగ్ కళాశాలల్లో  జేఎన్‌టీయూసీ విజయనగరం, ఎంవీజీఆర్ ఇంజనీరింగ్ కళాశాల, లెండీ ఇంజినీరింగ్ కళాశాలలు కన్వీనర్ సీట్లన్నీ మొదటి కౌన్సెలింగ్‌లోనే భర్తీ చేసుకున్నాయి. రెండో కౌన్సెలింగ్‌లో జిల్లాలోని మిగతా వాటిలో ఒక్క కళాశాల కూడా సీట్ల ఎంపిక నూరు శాతం పూర్తి చేసుకోలేదు. జీరో శాతం సీట్ల ఎంపిక కళాశాలలు లేకపోయినప్పటికీ రెండో కౌన్సెలింగ్‌లో రెండు కళాశాలలు మినహా దాదాపు అన్ని కళాశాలలోనూ తొలి కౌన్సెలింగ్ అలాట్ సీట్లు తిరస్కరించినవే ఉన్నాయి.
 
  రెండో కౌన్సెలింగ్‌లో మూడు కళాశాలల్లో కలుపుకొని అదనంగా అలాట్ అయిన సీట్లు 93 ఉన్నప్పటికీ తిరస్కరించినవి కూడా మూడు కళాశాలల్లో  22 అలాట్ సీట్లు  ఉన్నాయి. ఒక కళాశాలల్లో పెరిగినవి లేవు, తరిగినవి లేవు. దీంతో కళాశాల యాజమన్యాలకు  తొలి కౌన్సెలింగ్ కంటే రెండు కౌన్సెలింగ్‌లో పెరిగిన సీట్ల సంఖ్య లేదు.  కౌన్సెలింగ్ సీట్ల భర్తీలో సగానికి సగం  సీట్లను కూడా అభ్యర్థులు ఎంపిక చేసుకోలేదు.  జిల్లా పరిధిలోని 10 కళాశాలల్లో వివిధ గ్రూపులను కలిపి 3,592 సీట్లు ఉండగా తొలి విడత కౌన్సెలింగ్‌లోని 1,438 సీట్ల కంటే రెండో కౌన్సెలింగ్‌లో అధనంగా కేవలం 71 మంది అభ్యర్థులు మాత్రం ఎంచుకున్నారు. దీంతో మొత్తంగా 2,083 సీట్లు మిగిలిపోయాలి.  జిల్లాలో జేఎన్‌టీయూసీ విజయనగరం, ఎంవీజీఆర్, లెండీ కళాశాలల్లో నూరుశాతం కన్వీనర్ కోటా సీట్లను అభ్యర్థులు ఎంపిక చేసుకున్నారు. రెండో కౌన్సెలింగ్ ద్వారా అత్యధికంగా 52 సీట్లను  సీతం ఇంజినీరింగ్ కళాశాలలో, తరువాత వరుసలో 26 సీట్లను అవంతి ఇంజినీరింగ్  కళాశాలలో, మెరాకిల్ ఇంజినీరింగ్ కళాశాలో ఐదు సీట్లను ఎంచుకున్నారు.
 హెల్ప్‌లైన్ సెంటర్లకు వెళ్లక్కర్లేదు
 
 ఇంజినీరింగ్ సీట్లు రీ-అలాట్ అయిన వారికి హెల్ప్‌లైన్ సెంటర్ ఆమోదం అవసరం లేదు. ‘ఏపీఎంసెట్.ఎన్‌ఐసీ.ఐఎన్’ వెబ్‌సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటపుడు ఏ విధంగా అనుసరించారో అదే విధంగా ఇక్కడ పాటించాలి. అప్పుడు ఇచ్చిన పాస్‌వర్డ్‌ను ఇక్కడ కూడా ఉపయోగించాలి. సెల్ప్ రిపోర్టింగ్‌ను వెబ్‌లో సెలక్ట్ చేసుకుంటే... అలాట్టయిన సీటు మీకు కేటాయించి భర్తీ చేసినట్లు పరిగణలోకి తీసుకుంటారు. ఈ మేరకు తాత్కాలిక ప్రొవిజినల్ అలాట్మెంట్ పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. సీటు దక్కిన కళాశాలలో ఓరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో పాటు తాత్కాలిక ప్రొవిజినల్ అలాట్మెంట్ పత్రాన్ని తీసుకెళ్లాలి. ఈ నెల 23వ తేదీలోగా అన్‌లైన్ అలాట్మెంట్ కార్డులను తీసుకోవచ్చు. అయితే కళాశాలల్లో ప్రవేశాలు మాత్రం ఈ నెల 25వ తేదీలోగా చేసుకోవాలి. జిల్లాలోని ఆరు కళాశాలలో తాజాగా ఉన్న ఖాళీల పరిస్థితి ఈ విధంగా ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement