నినాదాలు చేస్తున్న వంశధార నిర్వాసితులు
సాక్షి, శ్రీకాకుళం: తమ త్యాగాలకు కనీస విలువ ఇవ్వకుండా నాడు పోలీసులతో ఉక్కుపాదం మోపించి కేసులు పెట్టించారని, ఆ ఉసురే మాజీ మంత్రి అచ్చెన్నాయుడికి తగిలిందని వంశధార నిర్వాసితులు మండిపడ్డారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు అరెస్టయిన నేపథ్యంలో వంశధార నిర్వాసితులు శనివారం హిరమండలంలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లిన అచ్చెన్నపై చూపుతున్న కరుణ తమపై నాడు చూపారా అని టీడీపీ నాయకులను ప్రశ్నించారు.
2017లో సంక్రాంతి చేసుకొని ఆనందంగా గ్రామాలను విడిచిపెడతామని చెప్పినా వినకుండా పోలీసు లాఠీదెబ్బలతో పాటు కేసులు నమోదుచేసిన విషయాన్ని గుర్తుచేశారు. నాడు మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యేగా ఉన్న కలమట వెంకటరమణమూర్తి ప్రోద్బలంతోనే అదంతా జరిగిందన్నారు. నాడు లేని బాధ ఇప్పుడు ఎందుకని ప్రశ్నించారు. బాధను దిగమింగుతూ కష్టాలను ఎదురీదుతూ గడిపామని అప్పటి పరిస్థితులను తలచుకున్నారు. కనీసం పునరావాస కాలనీల్లో వసతులు లేకుండా బలవంతంగా పంపించారని మండిపడ్డారు. అందుకే జైలు పాలయ్యారన్నారు. చదవండి: ‘కోడెలకు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు’
నాడు తమపై కేసులు మోపినప్పుడు కనీసం పలకరించలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే తమకు న్యాయం జరిగిందన్నారు. నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి స్థానిక ఎమ్మెల్యే రెడ్డి శాంతి చొరవచూపుతున్నారని.. ప్రాధాన్యతాక్రమంలో సమస్యలు పరిష్కరిస్తున్నారని చెప్పారు. సమావేశంలో జి.శ్రీనివాసరావు, ఎం.భాస్కరరావు, రేగాన ప్రకాశరావు, తొత్తడి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. చదవండి: జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట
Comments
Please login to add a commentAdd a comment