
ఏపీలో పట్టాలు తప్పిన మరో ఎక్స్‌ప్రెస్
తిరుపతి : వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మూడు చోట్ల రైలు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.
చదవండి : (ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. 35 మంది మృతి )
తాజాగా తిరుపతి రైల్వేస్టేషన్‌లో వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్ ఆదివారం తెల్లవారుజామున పట్టాలు తప్పింది. తిరుపతి నుంచి వాస్కోడిగామా వెళ్లాల్సిన రైలును ప్రయాణానికి సిద్ధం చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. రైలు ఇంజిన్ సహా రెండు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో రైలులో ప్రయాణికులు ఎవ్వరు లేకపోవడంతో ప్రాణనష్టం తప్పినట్లైంది. ఘటనాస్థలానికి చేరుకున్న రైల్వే అధికారులు మరమ్మతు పనులను వేగవంతం చేశారు. ఆదివారం తెల్లవారుజామున విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు వద్ద హిరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి 11.30గంటలకు పట్టాలు తప్పడంతో 32 మంది ప్రయాణికులు మృతి చెందగా, శుక్రవారం అర్థరాత్రి రాజస్థాన్‌లోని జైసల్మేర్‌లో రాణిఖేత్ ఎక్స్‌ప్రెస్ రైలులోని 10 బోగీలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే.