
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): వచ్చే ఆదివారం 21వ తేదీన సూర్యగ్రహణం నేపథ్యంలో ఇంద్రకీలాద్రిపై శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల ఆలయాలతో పాటు ఇతర ఉపాలయాలను మూసివేయనున్నట్లు ఆలయ వైదిక కమిటీ పేర్కొంది.
♦ 20వ తేదీ సాయంత్రం అమ్మవారికి పంచ హారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు.
♦ ఇక 21వ తేదీ ఉదయం 10–25 గంటలకు గ్రహణం ప్రారంభమై మధ్యాహ్నం 1–54 గంటలకు విడుస్తుందని పేర్కొన్నారు. గ్రహణం వీడిన అనంతరం మధ్యాహ్నం 2–30 గంటలకు ఆలయాన్ని తెరిచి శుభ్రపరుస్తారు. అమ్మవారికి స్నపనాభిషేకం, నిత్య అలంకరణ, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం పంచహారతుల అనంతరం ఆలయ ద్వారాలను మూసివేస్తారు.
♦ ఈ నేపథ్యంలో 21వ తేదీ అన్ని దర్శనాలను రద్దు చేశారు.
♦ 22వ తేదీ సోమవారం ఉదయం 6 గంటలకు దర్శనాలు యథావిధిగా ప్రారంభమవుతాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment