'వైఎస్ఆర్ వరుణయాగం వల్లే వర్షాలు కురిసాయి'
'వైఎస్ఆర్ వరుణయాగం వల్లే వర్షాలు కురిసాయి'
Published Sun, Jun 22 2014 11:40 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
విజయవాడ: 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వరుణయాగం చేయటం వల్లే సుభిక్షంగా వర్షాలు కురిసాయని విశాఖ పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు. సాంప్రదాయలకు పెద్ద పీట వేసిన వైఎస్ఆర్ హాయంలో వర్షాలు బాగా కురిసాయని ఆయన అన్నారు.
విజయవాడలో అక్షరదీవెన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా స్వరూపానంద సరస్వతి 'ఇప్పడు ఎవరూ సాంప్రదాయం పాటించడంలేదు' లేదు అని అన్నారు. ధార్మిక సంస్థల్లో పనిచేస్తూ అన్యమత ప్రచారం చేస్తున్నారని, అట్టి కార్యక్రమాలకు పాల్పడేవారిని వెంటనే తొలగించాలని విశాఖ పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు.
Advertisement
Advertisement