Swaroopananda Saraswati
-
క్షీరపురిలో మహాకుంభాభిషేకం
పాలకొల్లు సెంట్రల్ : పంచారామ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు క్షీరా రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 20, 21 తేదీల్లో మహాకుంభాభిషేకం నిర్వహించేందుకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇందుకు సంబంధించిన వివరాలను గజల్స్ శ్రీనివాస్ బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. క్షీరా రామలింగేశ్వర స్వామి క్షేత్రంలో మహాకుంభాభిషేకం నిర్వహించడం ఇదే ప్రథమమని ఆయన చెప్పారు. ఈ మహత్కార్యానికి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి, కాకినాడ శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద సరస్వతి చేతుల మీదుగా పూజా కార్యక్రమాలు జరుగుతాయన్నారు. గోగుల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్, సేవ్ టెంపుల్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నుదురుపాటి శ్రీనివాస శర్మ, సేవ్ టెంపుల్స్ జిల్లా అధ్యక్షుడు మేడికొండ శ్రీను, చల్లా ఆదినారాయణ, చల్లా గోపాలకష్ణ, బొక్కా రమాకాంత్, రావూరి చాచా, సోమంచి శ్రీనివాసశాస్త్రి, తాళ్లూరి సుబ్బారావు, బోణం చినబాబు తదితరులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. -
స్వామి స్వరూపానందపై కేసు నమోదు
షిర్డీ : షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు అయ్యింది. షిర్డీ సాయిబాబాపై వ్యాఖ్యలతో, లక్షలాదిమంది భక్తుల మనోభావాలను, మత విశ్వాసాలను గాయపరిచారన్న ఫిర్యాదు మేరకు స్వరూపానంద సరస్వతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నితిన్ కోటే అనే స్థానికుడి ఫిర్యాదు మేరకు భారతీ శిక్షాస్మతిలోని 295(ఏ), 298 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు షిర్డీ పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ సూర్యవంశి చెప్పారు. -
సాయిబాబా దేవుడు కాదా?...
వివాదాలు కొనితెచ్చుకోవడంలో రాజకీయ నాయకులతో ప్రస్తుతం బాబాలు పోటీ పడుతున్నారు. తాజాగా ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాను సాధువునన్న సంగతి మర్చిపోయి ఇటీవలే ఓ పాత్రికేయుడిపై చేయి చేసుకున్న స్వామివారు... ఈసారి ఏకంగా షిర్డీ సాయిబాబానే టార్గెట్ చేశారు. షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద సరస్వతి వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంలో విష్ణువుకు సంబంధించి కలియుగంలో 24 అవతారాలను చెప్పారని, కల్కి, బుద్ధ తప్ప ఇతర అవతారాల గురించి చెప్పలేదని, స్వరూపనంద సరస్వతి చెప్పుకొచ్చారు. మనిషిని దేవుడుగా కొలవడం తప్పని ఆయన స్పష్టం చేశారు. హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా సాయిబాబాను గుర్తించడానికి కూడా ఆయన నిరాకరించారు. కాగా స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలపై సాయి భక్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వరూపానంద ప్రచారం కోసమే ఈ వివాదాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడుతున్నారు. కాగా స్వరూపానంద సరస్వతి గతంలోనూ వార్తల్లో నిలిచారు. నరేంద్ర మోడీని విమర్శించిన బీహార్ సీఎం నితీష్ కుమార్తో కలిసి విరాట్ రామాయణ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి స్వరూపానంద సరస్వతి తన నోటి దురుసుతో మరోసారి పతాక శీర్షికలకు ఎక్కారు. -
'వైఎస్ఆర్ వరుణయాగం వల్లే వర్షాలు కురిసాయి'
విజయవాడ: 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వరుణయాగం చేయటం వల్లే సుభిక్షంగా వర్షాలు కురిసాయని విశాఖ పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు. సాంప్రదాయలకు పెద్ద పీట వేసిన వైఎస్ఆర్ హాయంలో వర్షాలు బాగా కురిసాయని ఆయన అన్నారు. విజయవాడలో అక్షరదీవెన కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా స్వరూపానంద సరస్వతి 'ఇప్పడు ఎవరూ సాంప్రదాయం పాటించడంలేదు' లేదు అని అన్నారు. ధార్మిక సంస్థల్లో పనిచేస్తూ అన్యమత ప్రచారం చేస్తున్నారని, అట్టి కార్యక్రమాలకు పాల్పడేవారిని వెంటనే తొలగించాలని విశాఖ పీఠాధిపతి స్వరూపానంద సరస్వతి అన్నారు.