షిర్డీ : షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు అయ్యింది. షిర్డీ సాయిబాబాపై వ్యాఖ్యలతో, లక్షలాదిమంది భక్తుల మనోభావాలను, మత విశ్వాసాలను గాయపరిచారన్న ఫిర్యాదు మేరకు స్వరూపానంద సరస్వతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నితిన్ కోటే అనే స్థానికుడి ఫిర్యాదు మేరకు భారతీ శిక్షాస్మతిలోని 295(ఏ), 298 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు షిర్డీ పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ సూర్యవంశి చెప్పారు.
స్వామి స్వరూపానందపై కేసు నమోదు
Published Wed, Jun 25 2014 8:45 AM | Last Updated on Tue, Aug 21 2018 6:21 PM
Advertisement
Advertisement