Shirdi saibaba
-
షిరిడీకి వెళ్లడం ఇక ఈజీ
షిరిడీ సాయిబాబా భక్తులకు శుభవార్త. ఇక నుంచి షిరిడీ వెళ్లాలంటే గంటల తరబడి రైలు ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. వచ్చే నెల నుంచి నేరుగా షిరిడీకి విమానాలు వెళ్లనున్నాయి. మహారాష్ట్ర ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఎంఏడీసీ) సంస్థ అహ్మద్‌నగర్ జిల్లాలో షిరిడీ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసింది. ఈ విమానాశ్రయానికి హైదరాబాద్, ముంబై, ఢిల్లీ సహా పలు నగరాల నుంచి విమానాలు వచ్చేందుకు వీలుంది. 2002లో ఏర్పాటైన ఎంఏడీసీ ఇంతవరకు ఒక్క విమానాశ్రయాన్ని కూడా అభివృద్ధి చేయలేదని కాగ్ ఇటీవలే వాతలు పెట్టింది. దాంతో తాము తొలిసారిగా ఈ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని అభివృద్ధి చేసినట్లు సంస్థ సీఎండీ విశ్వాస్ ఎం పాటిల్ తెలిపారు. విమానాశ్రయం దాదాపుగా సిద్ధమైందని, దీన్ని తామే నిర్వహిస్తామని, వచ్చే నెల నుంచి విమానాల రాకపోకలు మొదలవుతాయని ఆయన చెప్పారు. తొలుత కేవలం స్వదేశీ విమానాలను మాత్రమే ఇక్కడి నుంచి నడిపిస్తామని, ఆ తర్వాత అంతర్జాతీయ విమానాలు కూడా వస్తాయని అన్నారు. దీని కోసం పౌర విమానయాన మంత్రిత్వశాఖ రూ. 340.54 కోట్లు మంజూరు చేసిందన్నారు. దీని రన్‌వే 2,500 మీటర్ల పొడవుంటుందని, 3 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన టెర్మినల్ ఉందని, రన్ వేను 700 మీటర్ల మేర విస్తరించేందుకు ఇటీవలే రూ. 40 కోట్లు మంజూరయ్యాయని, దానికి సంబంధించిన పనులు కూడా మొదలుపెట్టామని పాటిల్ వివరించారు. ఇప్పటికే ఏటీసీ టవర్, సిస్టంలు సిద్ధమయ్యాయని, దీనికి అంతర్జాతీయ లుక్ ఇచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. దేశంలోని వివిధ నగరాల నుంచి షిరిడీకి రావాలంటే ప్రస్తుతం రైలు, రోడ్డు మార్గాలు మాత్రమే ఉన్నందున ప్రయాణాలను మరింత సులభతరం చేయడానికి ఈ విమానాశ్రయం ఉపయోగపడుతుందని పాటిల్ చెప్పారు. -
పెద్ద నోట్ల రద్దు ఎఫెక్ట్; షిర్డీ ట్రస్ట్ కీలక ప్రకటన
ముంబై: కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో షిర్డీ సాయిబాబా ఆలయ ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది. పెద్ద నోట్లను విరాళంగా తీసుకునేందుకు షిర్డీ సంస్థాన్ ట్రస్ట్ నిరాకరించింది. పెద్ద నోట్లను విరాళాలుగా తీసుకోబోమని ప్రకటించింది. ఇప్పటి దాకా భక్తులు సమర్పించిన పెద్ద నోట్లను బ్యాంకులో డిపాజిట్ చేశామని ట్రస్ట్ నిర్వాహకులు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేశాక ప్రజలు కరెన్సీ కష్టాలు పడుతున్న పసంగతి తెలిసిందే. కాగా ఆలయాలకు భక్తులకు సమర్పించే కానుకలపై దీని ప్రభావం పడలేదు. తిరుమల వేంకటేశ్వర స్వామి ఆలయంలోని హుండీకి భారీగా కానుకలు వచ్చాయి. -
ఏసీ టికెట్లు బుక్ చేస్తే.. నాన్ ఏసీలో పంపారు!
బోధన్ (నిజామాబాద్): ప్రైవేటు ట్రావెల్స్ సంస్థ నిర్వాకం యాత్రికులను అవస్థల పాలు చేసింది. అటవీ ప్రాంతంలో మూడు గంటలు నడిరోడ్డుపై పడిగాపులు గాయాల్సిన అవస్థ ఎదురైంది. దీనికి సంబంధించిన హైదరాబాద్, గుంటూరు ప్రాంతాలకు చెందిన బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని షిర్డి సాయిబాబా ఆలయానికి వెళ్లిన వారు తిరుగు ప్రయాణం కోసం షిర్డీలోనే ఖురానా అనే ట్రావెల్ సంస్థలో ఏసీ సర్వీసులో టికెట్లు కొనుగోలు చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.2వేలకు పైగా వసూలు చేశారు. శనివారం రాత్రి 8.30 గంటలకు సర్వీసు బయలుదేరింది. ఆదివారం ఉదయం 10.30 గలకు హైదరాబాద్ చేరుకోవాల్సిన సర్వీసును నాందేడ్ జిల్లా నర్సి గ్రామం శివారులో ఉదయం 11 గంటల ప్రాంతంలో డ్రైవర్ నిలిపి వేశాడు. అటవీ ప్రాంతంలో మూడు గంటల పాటు బస్సును నిలిపివేయడంతో పిల్లలు, మహిళలు ఇక్కట్ల పాలయ్యారు. ఆ సర్వీసుకు తెలంగాణలో ప్రవేశానికి పర్మిట్ లేకపోవడంతో... అదే ట్రావెల్స్ సంస్థకు చెందిన మరో బస్సును హైదరాబాద్ నుంచి రప్పించి అందులోకి ఎక్కించారు. ఏసీ సర్వీసుకు టికెట్లు బుక్ చేసుకుంటే నాన్ ఏసీ బస్సులో అక్కడి నుంచి పంపించారు. దీంత ట్రావెల్స్ యాజమానిపై చర్యలు తీసుకోవాలని సాలూర అంతరాష్ట్ర ఆర్టీవో చెక్‌పోస్టులో అధికారికి ఫిర్యాదు చేశారు. -
సాయిబాబా హారతి వేళలు యధాతథం
-
షిరిడి సాయిబాబాపై వ్యాఖ్యలు.. జోక్యానికి సుప్రిం నిరాకరణ
-
స్వామి స్వరూపానందపై కేసు నమోదు
షిర్డీ : షిర్డీ సాయిబాబా దేవుడు కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ద్వారకా పీఠం శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతిపై మంగళవారం పోలీసులు కేసు నమోదు అయ్యింది. షిర్డీ సాయిబాబాపై వ్యాఖ్యలతో, లక్షలాదిమంది భక్తుల మనోభావాలను, మత విశ్వాసాలను గాయపరిచారన్న ఫిర్యాదు మేరకు స్వరూపానంద సరస్వతిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. నితిన్ కోటే అనే స్థానికుడి ఫిర్యాదు మేరకు భారతీ శిక్షాస్మతిలోని 295(ఏ), 298 సెక్షన్ల కింద ఈ కేసు నమోదు చేసినట్లు షిర్డీ పోలీస్ ఇన్స్పెక్టర్ రామ్ సూర్యవంశి చెప్పారు. -
ఓ హిందువుగా ఆవేదన చెందాను: మోహన్‌బాబు
హైదరాబాద్: షిర్డీ సాయిబాబాపై ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలను ప్రముఖ నిర్మాత, నటుడు మోహన్‌బాబు ఖండించారు. షిరిడిసాయి దేవుడు కాదంటే బాధగా ఉందన్నారు. ఓ హిందువుగా ఆవేదన చెందానని చెప్పారు. కొంతమంది మతిచలించి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఈశ్వరుడి అంశ సాయిబాబా అని మోహన్‌బాబు పేర్కొన్నారు. షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని ఆయన అన్నారు. హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద చెప్పారు. -
సాయిబాబా దేవుడు కాదా?...
వివాదాలు కొనితెచ్చుకోవడంలో రాజకీయ నాయకులతో ప్రస్తుతం బాబాలు పోటీ పడుతున్నారు. తాజాగా ద్వారక శంకరాచార్య స్వరూపానంద సరస్వతి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తాను సాధువునన్న సంగతి మర్చిపోయి ఇటీవలే ఓ పాత్రికేయుడిపై చేయి చేసుకున్న స్వామివారు... ఈసారి ఏకంగా షిర్డీ సాయిబాబానే టార్గెట్ చేశారు. షిర్డీ సాయిబాబు దేవుడు కాదని, మనిషిని దేవుడిగా పూజించవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా షిర్డీసాయి దేవుడు కాడని, ఆయనకు ఆలయాలు కట్టడం సరికాదని సెలవిచ్చారు. పనిలో పనిగా హిందువులను విభజించేందుకే అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని స్వరూపనంద సరస్వతి వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మంలో విష్ణువుకు సంబంధించి కలియుగంలో 24 అవతారాలను చెప్పారని, కల్కి, బుద్ధ తప్ప ఇతర అవతారాల గురించి చెప్పలేదని, స్వరూపనంద సరస్వతి చెప్పుకొచ్చారు. మనిషిని దేవుడుగా కొలవడం తప్పని ఆయన స్పష్టం చేశారు. హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా సాయిబాబాను గుర్తించడానికి కూడా ఆయన నిరాకరించారు. కాగా స్వరూపానంద సరస్వతి వ్యాఖ్యలపై సాయి భక్తులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్వరూపానంద ప్రచారం కోసమే ఈ వివాదాన్ని తెరమీదకు తెచ్చారని మండిపడుతున్నారు. కాగా స్వరూపానంద సరస్వతి గతంలోనూ వార్తల్లో నిలిచారు. నరేంద్ర మోడీని విమర్శించిన బీహార్ సీఎం నితీష్ కుమార్‌తో కలిసి విరాట్ రామాయణ్ ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొని చర్చనీయాంశంగా మారింది. మొత్తానికి స్వరూపానంద సరస్వతి తన నోటి దురుసుతో మరోసారి పతాక శీర్షికలకు ఎక్కారు.