ట్విన్ సిస్టర్స్ సంచలనం
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): వారు ఒక తల్లి కడుపున ఒకే సమయంలో పుట్టారు. పదో తరగతిలో ఒకేలా మార్కులు సాధించారు. ఇపుడు ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలోనూ ఒకే మార్కులు తెచ్చుకొని సంచలనం సృష్టించారు. గతేడాది పదో తరగతి ఫలితాల్లో చర్చనీయాంశమయిన ఎన్.ధన్యశ్రీ, భవ్యశ్రీలు ఇపుడు ఇంటర్ మొదటి సంవత్సరంలోనూ అద్భుతంగా నిలిచారు.
ధన్యశ్రీ ఇంటర్మీడియట్ ఎంపీసీ చదువుతోంది. భవ్యశ్రీ బైపీసీ చదువుతోంది. ఇద్దరికీ 97.1శాతం మార్కులే రావడం విశేషం. అందులో సంస్కృతంలో ఇద్దరికీ 98 మార్కుల చొప్పునే వచ్చాయి. ఇద్దరు ఆణిముత్యాల్నీ చూసి తల్లిదండ్రులు శివప్రసాదరావు, అమరవాణి, అధ్యాపకులు అభినందించారు.
తల్లిదండ్రులకు పేరు తెస్తా..
ఉపాధ్యాయలు, తల్లిదండ్రుల సహకారంతో, మంచి షెడ్యూ ల్‌తో 990 మార్కులు సాధిం చా. తండ్రి అప్పారావు ఐఓసీ కంపెనీలో పనిచేస్తున్నారు. తల్లి దేవుడమ్మ గ్లోకమ్ కంపెనీలో హెల్పెర్‌గా పనిచేస్తోంది. ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించి తల్లిదండ్రుల కష్టానికి ఫలితమందిస్తా.
– పైల సుప్రియ, సీనియర్ ఎంపీసీ స్టేట్ థర్డ్(990), విశాఖ
ఎంఈసీలో టాపర్, కూచిపూడిలో గిన్నిస్ రికార్డు
శ్రీకాకుళం: ఎంఈసీ గ్రూపులో 983 మార్కులు సాధించి శ్రీకాకుళానికి చెందిన డొంకాడ నేహా రాష్ట్రస్థాయిలో టాపర్‌గా నిలిచింది. శ్రీకాకుళం నారాయణ కళాశాలలో ఇంటర్‌ను పూర్తి చేసింది. కాగా, ఈమె ప్రముఖ కూచిపూడి నృత్యదర్శకుడు రఘుపాత్రుని శ్రీకాంత్ వద్ద కూచిపూడిలో శిక్షణపొంది 2012, 2016 సంవత్సరాల్లో హైదరాబాద్‌లో జరిగిన నృత్యపోటీల్లో గిన్నిస్‌బుక్ వరల్డ్ రికార్డులో స్థానం దక్కించుకుంది. అలాగే ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో నృత్య ప్రదర్శనలిచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకుంది.