డెంగీపై సమరం
చిత్తూరు (సెంట్రల్) : రాష్ట్ర ప్రభుత్వం డెంగీపై సమరం ప్రకటించిందని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ కమిషనర్ సోమరాజు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన, అదనపు కమిషనర్ జయ చంద్రారెడ్డి చిత్తూరు ప్రభుత్వాస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ డెంగీపై పూర్తి అప్రమత్తంగా ఉన్నామని చెప్పారు. 24 గ ంటలు, ఏడు రోజలు కింది స్థాయి ఆస్పత్ర నుంచి జిల్లా స్థాయి ఆస్పత్రి వరకు ఎక్కెడికక్కడ ఫీవర్ సెల్లు ఏర్పాటు చేసి రోగుల వివరాలు తెలుసుకుంటున్నామని చెప్పారు. జ్వరం వచ్చిన ప్రతి రోగిని అన్ని పరీక్షలతో పూర్తిగా పరిశీలించి డెంగీపై నిర్ధారణకు వస్తున్నామన్నారు.
కాయకల్ప పథకం కింద చిత్తూరు, మదనపల్లె ఆస్పత్రులు ఎంపికయ్యాయని చెప్పారు. ఈ పథకం కింద ఆస్పత్రులకు పారిశుధ్ధ్యం, నీటి వసతులు, బెడ్ షీట్ల శుభ్రత, వైద్యుల వైద్య పరిశీలన, రోగులు ,ఆస్పత్రి ఆవరణపై శ్రద్ద తదితర అన్ని విభాగాలపై పాయింట్లను సేకరిస్తామన్నారు. రెండు బృందాలు తనిఖీ చేసి ఈ పాయింట్లు సేకరిస్తాయని, వాటిని పరిశీలించి మొదటి స్థానం వచ్చిన ఆస్పత్రికి రూ.50లక్షల పారితోషికం అందిస్తామన్నారు.
అలాగే ఈ ఆస్పత్రిని అపోలో ఆస్పత్రికి లీజుకిస్తారనే విషయంపై అపోహలొద్దని, 300 పడకలు కలిగిన ఆస్పత్రిని వారికి ఇవ్వడం వల్ల వారు అనేక డిపార్టుమెంట్లు పెట్టి ఇంకా అభివృద్ధి చేస్తారన్నారు. వారి సొంత నిధులు ఖర్చుపెట్టి రోగులకు మెరుగైన సేవలందించి తిరిగి ప్రభుత్వానికే అందిస్తారన్నారు. డీసీహెచ్‌ఎస్ సరళమ్మ, సూపరింటెండెంట్ జయరాజ్, ఆర్‌ఎంవో సంధ్య,డాక్టర్లు అరుణ్ కుమార్,దేవదాస్ పాల్టొన్నారు.