వార్డెన్‌పై విద్యార్థుల ఫిర్యాదు
నందికొట్కూరు:
విద్యార్థుల సంక్షమం పట్టకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్న వార్డెన్ కృష్ణమూర్తిపై చర్యలకు కలెక్టర్‌కు నివేదిస్తామని ట్రైనీ కలెక్టర్ లక్షణ్ ప్రకటించారు. శనివారం పట్టణంలోని విద్యనగర్‌లో ఉన్న ఎస్సీ హాస్టల్‌ను ఆయన తనిఖీ చేశారు. హాస్టల్ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. విద్యార్థులను అడిగి సమస్యలను అడిగి తెలుకున్నారు. దుస్తులు, పాఠ్యపుస్తకాలు ఇవ్వలేదని, బాత్‌రూంలు, మంచినీటి సమస్యలు ఉన్నాయని విద్యార్థులు ఆయనకు వివరించారు.
ప్రైవేట్ వ్యక్తులు ఎప్పుడంటే అప్పుడు హాస్టల్‌కు వచ్చి బెదరిస్తుంటారని ఫిర్యాదు చేశారు. మెనూ ప్రకారం ఆహారం వడ్డించడం లేదని చెప్పారు. ఉడికి, ఉడకని అన్నం, పురుగుల అన్నం, గొడ్డు కారం వడ్డిస్తున్నారని పేర్కొన్నారు. స్థానికంగా మీ వార్డెన్ ఉంటారని ట్రైనీ కలెక్టర్ ప్రశ్నించారు. కర్నూల్ నుంచి వారంలో ఒకట్రెండు రోజులు వస్తారని చెప్పారు.
హాస్టల్ విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా, విధులకు డుమ్మాకొడుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వార్డెన్ కృష్ణమూర్తిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంపై కలెక్టర్‌కు నివేదిక అందిస్తామని చెప్పారు. ఈ తనిఖీ తహశీల్దార్ రామసుబ్బయ్య, ఆర్‌ఐ ప్రభాకర్, సిబ్బంది పాల్గొన్నారు.