ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లో ఆప్షన్లు: అశోక్‌బాబు | We are ready to give employees options | Sakshi
Sakshi News home page

ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లో ఆప్షన్లు: అశోక్‌బాబు

Published Sun, May 4 2014 2:52 AM | Last Updated on Sat, Mar 23 2019 9:03 PM

ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లో ఆప్షన్లు: అశోక్‌బాబు - Sakshi

ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లో ఆప్షన్లు: అశోక్‌బాబు

 సాక్షి, న్యూఢిల్లీ:  సార్వత్రిక ఎన్నికల అనంతరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఏర్పడే కొత్త ప్రభుత్వాలు రెండూ ఒప్పుకుంటే అన్ని స్థాయిల్లోని ఉద్యోగులకు ఆప్షన్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి, అదనపు కార్యదర్శి రాజీవ్ శర్మలు వెల్లడించినట్లు ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు చెప్పారు. ఆ ప్రభుత్వాలు అంగీకరిస్తే ఏ రాష్ట్రంలోని ఉద్యోగులను ఆ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేస్తామని చెప్పారన్నారు. శనివారం అశోక్‌బాబుతో పాటు ఏపీఎన్జీవో సంఘం నేతలు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు హోంశాఖ కార్యదర్శి, అదనపు కార్యదర్శిలను కలిసి ఆప్షన్ల విషయమై వినతులు అందజేశారు. అనంతరం అశోక్‌బాబు ఏపీభవన్‌లో మీడియాతో మాట్లాడారు. పెన్షన్ల విషయంలోనూ ఇబ్బందులు తలెత్తకుండా పెన్షన్ ఖర్చును జనాభా ప్రతిపాదికన ఇరు ప్రాంతాలకు పంచుతున్నామని కేంద్ర అధికారులు చెప్పారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement