ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలివ్వలేని పరిస్థితి: చంద్రబాబు
ఏలూరు: రాష్ట్రంలో రానురాను జనాభా తగ్గుతోందని ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతి ఏటా 9 లక్షల జనన మరణాలు నమోదవుతున్నాయని తెలిపారు. పుట్టేవారి సంఖ్య తగ్గుతోందని, వృద్ధుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఇంటికి ఒకరిద్దరు పిల్లలున్నా తప్పులేదన్నారు. 15 ఏళ్ల క్రితం తాను ఒక బిడ్డనే కనమని చెప్పానని..ఇప్పుడు అలా చెప్పే పరిస్థితి లేదన్నారు.
తాము అధికారంలోకి రాకముందు 80 యూనిట్ల విద్యుత్ లోటు ఉంటే ఒక్కో యూనిట్ కు రూ. 6 చొప్పున కొనుగోలు చేసి రెండు నెలల్లోనే ఆ సమస్యను అధిగమించామన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జీతాలిచ్చే పరిస్థితి లేదని అందుకే కేంద్ర ప్రభుత్వాన్ని సాయం కోరామన్నారు. గత యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజన హేతుబద్ధంగా చేయకపోవడం వల్లే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలిందని ఎద్దేవా చేశారు.