కరీంనగర్ సిటీ, న్యూస్‌లైన్: దశాబ్దాలుగా తెలంగాణవాదులు చేస్తున్న పోరాట ఫలితాన్ని అందించిన ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీకి అండ గా నిలుద్దామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బా బు కోరారు. సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా సోమవారం నగరంలో జరి గిన పలు కార్యక్రమాల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ చౌక్ నుంచి రాజీవ్ చౌక్ వరకు నిర్వహించిన 2కే రన్‌ను ప్రారంభించారు. తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసి న మహానేత సోనియా అని కొనియాడా రు. నాలుగేళ్ల క్రితం తన పుట్టిన రోజున ప్రకటించిన తెలంగాణకు.. కట్టుబడి ప్ర క్రియ పూర్తిచేస్తున్నారని చెప్పారు.
ఆమె పుట్టిన రోజును సీమాంధ్రలో కొందరు బ్లాక్‌డేగా పాటించడాన్ని ఖండించారు. తె లంగాణలో మాత్రం సోనియా జన్మదినం నవ తెలంగాణకు అంకితమనే నినాదం తో కార్యక్రమాలు చేపట్టామన్నారు. తె లంగాణ ప్రజానీకం సోనియాకు కృతజ్ఞత గా ఉండాలన్నారు. స్వాతంత్య్ర సమరయోధులు బోయినిపల్లి వెంకట్రామారా వు, ఆగారెడ్డి, శేషాచారి, రాజమౌళిలను మంత్రి సన్మానించారు. ఎన్‌ఎస్‌యూఐ ఏర్పాటు చేసిన మూడురంగుల బెలూన్ల ను గాలిలో ఎగురవేశారు. మార్కెట్‌యార్డులో రైతులకు పండ్లు, స్వీట్లు పంపిణీచేశారు. ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, ఎ మ్మెల్సీ టి.సంతోష్‌కుమార్, డీసీసీ అధ్యక్షుడు కొండూరు రవీందర్‌రావు, ఎస్సీ కా ర్పొరేషన్ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఏఎంసీచైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, మాజీ మేయర్ డి.శంకర్, బీసీసెల్ చైర్మన్ ఆమ ఆనంద్, గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మళ్లీ వెలసిన సోనియా గుడి
తెలంగాణ బంద్ సందర్భంగా ధ్వంసమైన సోనియా నమూనా గుడిని పీసీసీ కార్యదర్శి వై.సునీల్‌రావు తిరిగి ఏర్పాటుచేశారు. మంత్రి, ఇతర నాయకులు నమూనా గుడి ముందు కొబ్బరికాయలు కొట్టారు.
పరుగెత్తిన మంత్రి
2కే రన్‌లో భాగంగా మంత్రి శ్రీధర్‌బాబు స్వయంగా రెండు కిలోమీటర్లు పరుగెత్తడం పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. తెలంగాణ చౌక్‌లో 2కే రన్‌ను ప్రారంభించిన మంత్రి పార్టీ శ్రేణులు, క్రీడా సంఘాలతో కలిసి శ్రీపాదచౌక్, చొక్కారావు సర్కిల్, అనభేరి సర్కిల్, అమరవీరుల స్తూపం మీదుగా రాజీవ్‌చౌక్ వరకు పరిగెత్తారు.
శ్రీధర్‌బాబు సీఎం కావాలె: బోవెరా
తెలంగాణకు శ్రీధర్‌బాబు సీఎం కావాలని ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, తోటపల్లి గాంధీ బోయినిపల్లి వెంకట్రామారావు ఆకాంక్షించారు. తెలంగాణ చౌక్‌లో సన్మానం తర్వాత ఆయన మాట్లాడుతూ..‘ నాకో కోరిక ఉంది.శ్రీధర్‌బాబు ముఖ్యమంత్రి కావాలి’ అనడంతో శ్రేణులంతా నినాదాలు చేశారు.
కాంగ్రెస్‌లో చేరిన గుర్రం పద్మ
టీఆర్‌ఎస్ కార్మిక విభాగం రాష్ట్ర కార్యదర్శి గుర్రం పద్మ సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. సోనియా జన్మదినోత్సవం సందర్భంగా రాజీవ్‌చౌక్‌లో జరిగిన కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ నగర ప్రధాన కార్యదర్శి రేణుక, కార్యదర్శి మాధవి కూడా కాంగ్రెస్‌లో చేరా రు. ప్రభుత్వ విప్ ఆరెపల్లి మోహన్, గిడ్డంగుల సంస్థ డెరైక్టర్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ కార్యదర్శి నేరెళ్ల శారద, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు గుగ్గిళ్ల జయశ్రీ, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆమ ఆనంద్ పాల్గొన్నారు.
సోనియాకు అండగా నిలుద్దాం
Published Tue, Dec 10 2013 6:42 AM | Last Updated on Mon, Oct 22 2018 9:16 PM
Advertisement