‘బిందు’వు కరువు! | Went into groundwater | Sakshi
Sakshi News home page

‘బిందు’వు కరువు!

Published Mon, Aug 3 2015 2:09 AM | Last Updated on Sun, Sep 3 2017 6:39 AM

‘బిందు’వు  కరువు!

‘బిందు’వు కరువు!

అడుగంటిన  భూగర్భజలాలు
ఒట్టిపోయినబోరుబావులు
{yిప్ ఇరిగేషన్‌పై  ఆసక్తి చూపని రైతులు
ఈ ఏడాది లక్ష్యం 23,935 హెక్టార్లు
దరఖాస్తులు 7వేలు డీడీలు కట్టింది 1,200 మందే

 
తీవ్ర వర్షభావంతో భూగర్భజలాలు అడుగంటాయి. బోరుబావులు ఒట్టిపోయాయి. ఈ నేపథ్యంలో జిల్లా రైతాంగం బిందుసేద్యంపై ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో బిందుపరి    కరాలను పెద్ద ఎత్తున ఏర్పాటుచేసి నీటి పొదుపునకు చర్యలు చేపట్టాలనే ప్రభుత్వ లక్ష్యం నీరుగారిపోతోంది.

చిత్తూరు :జిల్లాలో 2015-16 సంవత్సరానికి గాను 23,935 హెక్టార్లలో బిందుపరికరా లు బిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పటివరకు బిం దు పరికరాల కోసం 7వేల దరఖాస్తులు  రాగా,  1,200 మంది రైతులు  మాత్రమే పరికరాల కోసం డీడీలు చెల్లించారు. దరఖాస్తు చేసుకున్న మిగిలిన రైతులు డీడీలు చెల్లించేందుకు ముందుకు రావడం లేదు.  తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగండడం, 2వేల అడుగుల లోతుకు బోర్లు వేసినా నీరందే పరిస్థితి లేకపోడమే అందుకు కారణమవుతోంది. ఇప్పటివరకు బోరుబావుల్లో వస్తున్న అరకొర నీరు సైతం ఇంకిపోవడంతో  వేలాది బోర్లు ఒట్టిపోయాయి. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉన్న బోర్లు సైతం ఒట్టిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో డ్రిప్, స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసుకునేందుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. జిల్లాలో నీటి ఎద్దడి నేపథ్యంలో బిందు సేద్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.

ఇందుకోసం సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం సబ్సిడీని అందిస్తోంది. ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగానే బిందు పరికరాలను  బిగిస్తుండగా, ఐదు ఎకరాలు  పైబడిన రైతులకు 50 శాతం సబ్సిడీతో పరికరాలను ఇస్తున్నారు. జిల్లాలో అధికంగా సాగవుతున్న వేరుశెనగ, మామిడి, చెరకు, కూరగాయల పంటలను సైతం బిందుసేద్యం పరిధిలోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ మేరకు విస్తృత ప్రచారం కల్పించారు. ఇప్పటివరకు జిల్లాలో 79వేల హెక్టార్లలో బిందుపరికరాలు బిగించారు. ఈ ఏడాది 23,935 హెక్టార్లను బిందుసేద్యం పరిధిలోకి తీసుకురావాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తీవ్ర వర్షాభావ పరిస్థితుల ఇందుకు అడ్డంకిగా మారాయి. తాజా గణాంకాలు చూస్తే   ఏడాది ముగిసే నాటికి 1500 మంది రైతులకు మించి బిందు పరికరాల కోసం వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. 2014-15 లో 6వేల హెక్టార్ల పరిధిలో 7వేల మంది రైతులు బిందుపరికరాలను ఏర్పాటు చేసుకున్నారు. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 15 శాతం కూడా బిందు పరికరాల ఏర్పాటుకు రైతులు ఆసక్తి చూపడం లేదు. 2010-11 లో 7,570 హెక్టార్లు లక్ష్యం కాగా 6,733.38 హెక్టార్లలో బిందు పరికరాలు బింగించారు. 2011-12లో 12,482 హెక్టార్లు లక్ష్యం కాగా 8596.57 హెక్టార్లలో, 2012- 13లో 6712 లక్ష్యంగా, 6494.62 హెక్టార్లలో, 2013-14 లో 7,981 లక్ష్యంగా 6,022.77 హెక్టార్లలో, 2014-15 8,428 హెక్టార్లు లక్ష్యం కాగా, 6169.06 హెక్టార్లలో బిందు పరికరాలను బిగించారు.  తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోరుబావుల ద్వారా నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతోనే బిందుపరికరాల ఏర్పాటుకు రైతులు ఆసక్తి కనబరచడం లేదని సూక్ష్మనీటిసాగు పథకం పీడీ శ్రీనివాసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement