
తెలంగాణపై అప్పుడులేని అభ్యంతరం ఇప్పుడెందుకు?
సీమాంధ్రులకు ఉపముఖ్యమంత్రి దామోదర సూటిప్రశ్న
మునిపల్లి, న్యూస్‌లైన్: తెలంగాణ అంశంపై గతంలో లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సీమాంధ్ర నేతలను ప్రశ్నించారు. మెదక్ జిల్లా మునిపల్లి మండలంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ అంశాన్ని 2004-09 కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టగా ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయని సీమాంధ్ర ప్రజాప్రతినిధులు ప్రస్తుతం ఎందుకు అడ్డు తగులుతున్నారని ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు.. కేవలం ఓట్ల కోసం, సీట్ల కోసమే అవసరమా? అని ప్రశ్నించారు.