అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి | woman died unconditionally | Sakshi

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

Mar 25 2015 4:28 AM | Updated on Oct 17 2018 5:10 PM

స్థానిక ఎన్జీఓఎస్ కాలనీలో మంగళవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

బనగానపల్లె: స్థానిక ఎన్జీఓఎస్ కాలనీలో మంగళవారం ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. అవుకు మండలం పెద్దకొట్టాల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు గుంటూరు జిల్లా తెనాలి ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన మొదటి భార్య పద్మావతికి చాలా కాలంగా సంతానం కలుగకపోవడంతో నాలుగు నెలల క్రితమే మిడతూరు మండలం చెరుకుచెర్ల గ్రామానికి చెందిన లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నాడు. వెంకటేశ్వర్లు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తుండటంతో ఇద్దరు భార్యలు ఒకే ఇంటిలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మీదేవి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. మృతిరాలి తల్లిదండ్రులు మాత్రం తన కుమార్తెది హత్యేనని అనుమానిస్తుండగా, భర్త వెంకటేశ్వర్లు మాత్రం ఆత్మహత్యకు పాల్పడిందని చెబుతున్నాడు. సమాచారం అందుకున్న సీఐ శ్రీనివాసులు, తహశీల్దార్ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్‌ఐ జయన్న విలేకరులకు తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement