'సమైక్యం కోసం పోరాడుతున్న ఒకే ఒక్కడు' | Y.S.Jagan mohan reddy one man army of Samaikyandhra, says east godavari district women | Sakshi
Sakshi News home page

'సమైక్యం కోసం పోరాడుతున్న ఒకే ఒక్కడు'

Published Sat, Nov 30 2013 1:21 PM | Last Updated on Fri, Aug 17 2018 8:19 PM

'సమైక్యం కోసం పోరాడుతున్న ఒకే ఒక్కడు' - Sakshi

'సమైక్యం కోసం పోరాడుతున్న ఒకే ఒక్కడు'

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచాలనే లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమైక్య శంఖారావం యాత్ర చేపట్టారు. ఆ యాత్ర విజయవంత కావాలని తూర్పు గోదావరి జిల్లా మహిళలు శనివారం కాకినాడలో ఆకాంక్షించారు. ఈ సందర్భంగా నగరంలోని ప్రసిద్ధ బాలత్రిపుర సుందరి దేవాలయంలో కుంకుమ పూజలు నిర్వహించారు.

 

అనంతరం మహిళలు మాట్లాడుతూ.... సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని వారు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పం నుంచి వైఎస్ జగన్ సమైక్య శంఖారావం యాత్ర ప్రారంభించడం పట్ల వారు హార్షం ప్రకటించారు.

 

కాంగ్రెస్ పార్టీ విభజనపై మెండి వైఖరితో ముందుకు వెళ్తున్న సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహారిస్తున్న తీరుపట్ల మహిళలు ఈ సందర్బంగా మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ సమైక్యవాదం, ప్రతిపక్ష నేత చంద్రబాబు రెండు కళ్ల సిద్దాంతాన్ని ఈ సందర్బంగా తూర్పు గోదావరి జిల్లా మహిళలు ఎండగట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement