
బస్సు ప్రమాదంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
హైదరాబాద్: షోలాపూర్ బస్సు ప్రమాదంలో 8 మంది తెలుగువారు మృతిచెందిన దుర్ఘటనపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.
మహారాష్ట్రలోని షోలాపూర్ సమీపంలోని పండరీపురంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో కృష్ణా జిల్లాకు చెందిన 8 మంది తెలుగువారు మృత్యువాత పడ్డారు. చలమలశెట్టి పాండురంగ, జగన్మోహన్ రావు, లక్ష్మి, పి. లక్ష్మి, ఎన్. లక్ష్మీకుమారి, శేషమణి, వెంకటేష్, రేష్మ ప్రాణాలు కోల్పోయినట్టు గుర్తించారు.