ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జగన్ మద్దతు
కర్నూలు(రాజ్‌విహార్): ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు. బుధవారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన స్థానిక బళ్లారి చౌరస్తా వద్ద ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో మాట్లాడారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయమైనవేనని ఆయన అన్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేనందు వల్లే సమ్మె బాట పట్టారని పేర్కొంటూ సమ్మెకు తమ మద్దతు ఉంటుందని తెలిపారు.