కష్టాలన్నీ తీరుతాయి | YS Jagan mohan reddy Samiyakashkaram Yataya | Sakshi
Sakshi News home page

కష్టాలన్నీ తీరుతాయి

Published Thu, Jan 30 2014 4:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:09 AM

YS Jagan mohan reddy Samiyakashkaram Yataya

  •      జననేత భరోసా
  •      10వ రోజూ సమైక్య, ఓదార్పుయాత్రలకు అపూర్వ స్పందన
  •      రైతుకూలీలు, కార్మికులు, రైతులతో మాట్లాడిన వై.ఎస్.జగన్
  •      జీవాగ్రంలో ఓదార్పు
  •      మహానేత వైఎస్‌ఆర్ విగ్రహాల ఆవిష్కరణ
  •  ‘నాలుగు నెలల తర్వాత మన ప్రభుత్వం వస్తుంది. కొంచెం ఓపిక పట్టండి. మీ కష్టాలన్నీ తీరుతాయి’ అంటూ వైఎస్‌ఆర్‌సీపీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు ధైర్యం చెప్పారు. నాలుగో విడత సమైక్య శంఖారావం, ఓదార్పు యాత్ర 10వ రోజు బుధవారం శ్రీకాళహస్తి, చంద్రగిరి నియోజకవర్గాల్లో సాగింది. జనం అడుగడుగునా అపూర్వ స్వాగతం పలికారు. మహిళలు, వృద్ధులు, వికలాంగులు, రైతు కూలీలు, కార్మికులు ఇలా అన్ని వర్గాల ప్రజలు తమ సమస్యలను జననేత దృష్టికి తీసుకొచ్చారు.            
     
     సాక్షి, తిరుపతి:  వైఎస్‌ఆర్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ సమన్వయకర్త బియ్యపు మధుసూదన్‌రెడ్డి ఇంటి నుంచి బుధవారం   జననేత సమైక్య, ఓదార్పు యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు ఇంట్లో శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నుం చి వచ్చిన వేదపండితులు  జగన్‌ను ఆశీర్వదించారు. అక్కడ తన కోసం వేచి ఉన్న ప్రజలను జననేత కలుసుకున్నా రు. అనంతరం రామ్‌నగర్ కాలనీ సమీపంలో ఉన్న ఇటుకబట్టీ మహిళా కార్మికులు జగన్‌ను కలిశారు. వారి సమస్యలను ఆయన తెలుసుకున్నారు.

    ఇక్కడే ఒక అంధ బాలుడిని ఆప్యాయంగా పల కరించారు. బిడ్డకు చూపు వచ్చే అవకాశం ఉందా అని బాలుడి తండ్రిని అడిగారు. ఆపరేషన్ చేస్తే రావచ్చని ఆ యన తెలిపారు. ‘నాలుగునెలల్లో మన ప్రభుత్వం రాగానే ఆపరేషన్ చేయిద్దాం నువ్వు మెడికల్ రిపోర్టు సిద్ధం చేసుకో’ అని జననేత హామీ ఇచ్చారు. అనంతరం రోడ్‌షో నిర్వహిస్తూ ఏపీ సీడ్‌‌స ఆ ర్‌‌చ వద్దకు చేరుకున్నారు. అక్కడ వేచి ఉన్న మహిళలు జగన్‌ను కలుసుకున్నా రు. హౌసింగ్‌బోర్డు కాలనీ వద్దకు రాగా నే అభిమాన నేతను చూసేందుకు మహిళలు పోటీపడ్డారు. ఆటోగ్రాఫ్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి సమైక్యాంధ్ర సిం హం వై.ఎస్.జగన్ అని రాసున్న బని యన్లు ధరించిన యువకులు మోటారు సైకిళ్లపై జగన్ కాన్వాయ్ వెంట వచ్చా రు.

    నాగళ్ల బహూకరణ
     
    బూరగమానుకండ్రిగలో జగన్ రోడ్‌షో నిర్వహించారు. అభిమాన నేతను చూ సేందుకు గ్రామస్తులు రోడ్డుపైకి చేరుకున్నారు. బాణసంచా కాలుస్తూ ఘన స్వాగతం పలికారు. ఇక్కడ మూడు నాగళ్లను రైతులు జననేతకు బహూకరించారు. వైఎస్‌ఆర్‌సీపీ జెండా రంగులతో కూడిన పెయింట్ చేసిన పారలను రైతులు పెకైత్తి చూపుతూ జై జగన్ అం టూ నినాదాలు చేశారు. రాజన్న బిడ్డను చూసేందుకు రైతులు పోటీపడ్డారు. అంతకు ముందు రైల్వేస్టేషన్, పానగల్ సెంటర్లలో తన కోసం వేచివున్న ప్ర జలను జననేత పలకరించారు.

     చిన్నారికి విజయమ్మగా నామకరణం


     మిట్టకండ్రిగ వద్దకు చేరుకోగానే వృద్ధులు, మహిళలు జగన్‌ను కలిసేం దుకు పోటీపడ్డారు. ఇక్కడ జననేతను చూసేందుకు బస్టాప్‌లపైకి ఎక్కిన యు వకులు జై సమైక్యాంధ్ర అంటూ నినాదాలు హోరెత్తించారు. ఇక్కడ సురేష్, పోలయ్య అనే ఇద్దరు వికలాంగులతో జగన్ మాట్లాడారు.   పింఛన్ అందుతోందా అని వారిని వాకబు చేశారు. ఒక మహిళ తన పాపకు నామకరణం చేయాలని కోరారు. ఆ చిన్నారికి విజయమ్మ అని జగన్ నామకరణం చేశారు. హైవే పెట్రోల్ బంకుల్లో, రెస్టారెంట్లలో, వడ్లమిషన్‌లలో పనిచేస్తున్న కార్మికులు పరుగున వచ్చి కరచాలనం చేశారు.   హైవే లో వైఎస్‌ఆర్‌టీయూసీ నాయకులు  స మస్యలపై జననేతకు వినతిపత్రం సమర్పించారు.
     
    ట్రాక్టర్లలో వచ్చిన జనం

     చెర్లోపల్లె ఎస్సీ కాలనీ, చెర్లోపల్లెల్లో మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో కాన్వాయ్‌కి ఎదురొచ్చి తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. ఈ గ్రామంలోనే మూడుచోట్ల మహిళలు జగన్ కాన్వాయ్‌ను ఆపారు. ఎగువవీధి క్రాస్ (తొండమనాడు) వద్ద చుట్టుపక్కల పల్లెల నుంచి ట్రాక్టర్లు వేసుకుని వచ్చిన ప్రజలు జగన్‌ను చూసేందుకు కాన్వాయ్ ఆపారు. దీంతో జననేత ఇక్కడ గం టకుపైగా ఉండి ప్రతి ఒక్కరినీ పలకరిం చి కదిలారు. సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ గిరిజనులు స్వాగతం పలి కారు.

    హైవేలో నిలిపిన బస్సుల పెకైక్కి ఆర్‌టీసీ కార్మికులు, ప్రయాణికులు జగన్‌ను చూడడం కనిపించింది. కాపుగున్నేరి వద్ద స్కిమ్స్ మేనేజ్‌మెంట్ కళాశాల విద్యార్థులు జగన్‌ను కలిశారు. అభివృద్ధి ఎలా చేయాలనే దానిపై ఒక విద్యార్థిని తన సొంత సూచనలతో కూడిన రచనను అందజేశారు. జననేత దీనిని ఆసక్తిగా చదివారు. ఇక్కడ జగన్‌ను కలిసిన మహిళలు తమకు పావలా వడ్డీ తిరిగి ఇవ్వకుండా బ్యాంకులు ఇబ్బంది పెడుతున్నాయని చెప్పారు.

     జననేతను కలిసిన  కోకోకోలా కార్మికులు

     కోకోకోలా ఫ్యాక్టరీ కార్మికులు వై.ఎస్.జగన్‌ను కలిసి తమకు ఇస్తున్న వేతనాలు చాలడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజ అనే అంగన్‌వాడీ వర్కర్   అంగన్‌వాడీ వర్కర్స్ సమస్యలను వచ్చే ఎన్నికల్లో పార్టీ అజెండాలో ఒక అంశంగా చేర్చాలని కోరారు. ఇక్కడ తిరుపతి నుం చి ద్విచక్రవాహనానికి ఫ్యాన్ గుర్తు తగిలించుకుని వచ్చిన పార్టీ నాయకులు దుద్దేలబాబు అందరినీ ఆకట్టుకున్నారు.

    ఇసుకగుంట వద్ద వేచి ఉన్న మహిళలను జననేత పలకరించారు. చల్లపాళెం, చల్లపాళెం బీసీ కాలనీల వద్ద మహిళలు, గ్రామస్తులు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. వరుసలో నిలబడిన మహిళలందరినీ జననేత ఆశీర్వదించారు. రాచగున్నేరి, ల్యాంకో ఫ్యాక్టరీ వద్ద కార్మికులు, గ్రామస్తులు జగన్‌ను ఆపి స్వాగ తం పలికారు. మన్నసముద్రం వద్ద ఏర్పేడు సింగిల్‌విండో అధ్యక్షుడు నాగార్జునరెడ్డి ఆధ్వర్యంలో గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పట్టారు. మేర్లపాక ఎస్సీకాలనీలో దళిత మహిళలను జగన్ పలకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
     
    మహానేత విగ్రహాల ఆవిష్కరణ

     
    ఏర్పేడులో మహానేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని జగన్ ఆవిష్కరించారు. ఏర్పేడు సభలో యాదవులు జననేతకు కంబళికప్పి, గొర్రెపిల్లను బహూకరిం చారు. ఇక్కడ జననేతను చూసేందుకు జనం బారులు తీరడంతో హైవే కిక్కిరిసింది. అనంతరం సీతారాంపేటలో మహిళలు మంగళహారతులతో  ఆహ్వానించారు. అంజిమేడు క్రాస్‌లోనూ జగన్‌కు ఘన స్వాగతం లభించింది. అం జిమేడు గ్రామంలో మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని  ఆవిష్కరించారు. మూడేళ్ల క్రితమే విగ్రహాన్ని సిద్ధం చేసుకున్న గ్రామస్తులు జగన్ చేతనే ఆవిష్కరింపజేయాలని ఇన్ని రోజులూ వేచి ఉన్నారు.
     
    అవ్వా ఆరోగ్యం ఎలా ఉంది
     
    ఇసుకతాగేలిలో వై.ఎస్.జగన్‌కు ఆత్మీయ స్వాగతం లభించింది. ఇక్కడ వందేళ్లకుపైగా వయసున్న వృద్ధురాలిని జననేత పలకరించారు. ఆమె ఆరోగ్యం గురించి వాకబు చేశారు. గోపాలపురంలో మహిళలు   శాలువతో సత్కరించారు. మల్లవ రం, గుత్తివారిపల్లె, వెదళ్లచెరువు, గురవరాజుపల్లెలో ఘన స్వాగతం లభిం చిం ది. తర్వాత  రేణిగుంట గాంధీ బొమ్మసెంటర్ వరకు నిర్వహించిన రోడ్ షోలో జనం భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement