వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష వెంటనే విరమించాలని సీనియర్ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. శుక్రవారం ఈ మేరకు ఆయన వైఎస్ జగన్కు లేఖ రాశారు. వైఎస్ జగన్ను అభిమానించే ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాకంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు.
దీక్ష ద్వారా జగన్ ఆరోగ్యం దెబ్బ తింటే అభిమానులు తీవ్రంగా కలత చెందుతారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఆసుపత్రిలో దీక్ష కొనసాగిస్తున్నట్లు వివిధ పత్రికల్లో వచ్చిన పలు వార్తా కథనాలు చదివినట్లు ఆయన తెలిపారు. ఫ్లూయిడ్స్ తీసుకోవడానికి నిరాకరించినట్లు ఆ వార్త కథనాల ద్వారా తెలుసుకునీ ఆవేదన కలిగిందని పొత్తూరి వెంకటేశ్వరరావు ఈ సందర్భంగా జగన్కు రాసిన లేఖలో వివరించారు.