జగన్‌కు సాదర వీడ్కోలు
► విమానాశ్రయంలో కిక్కిరిసిన అభిమానులు
► సెల్ఫీల కోసం ఎగబడ్డ యువత
శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం విశాఖ చేరుకున్న వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఎయిర్‌పోర్టులో పార్టీనాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఘనంగా వీడ్కోలు పలికారు. యువకులు సెల్ఫీలు తీసుకోడానికి ఆరాటపడ్డారు.
గోపాలపట్నం: విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో శనివారం వైఎస్సార్‌సీపీ అధినేత, రాష్ట్ర ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డికి అభిమానులు, నేతలు ఘనంగా వీడ్కోలు పలికారు. తమ అభిమాన నేతను కలుసుకోవడానికి ఉవ్విళ్లూరారు. అభిమానంతో సందడి చేశారు. శ్రీకాకుళం జిల్లా పర్యటన ముగించుకుని శనివారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. అనంతరం హైదరాబాద్‌కి ఆయన పయనమయ్యారు.
ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డిని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్, ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాస్, కరణం ధర్మశ్రీ, మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణరాజు, నియోజకవర్గ సమన్వయకర్తలు తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అక్కరమాని విజయనిర్మల, సీఈసీ సభ్యుడు శ్రీకాంత్‌రాజు, రాష్ట్ర గిడ్డంగుల సంస్ధ మాజీ చైర్మన్ సత్తి రామకృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బొల్లవరపు జాన్‌వెస్లీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి రవిరెడ్డి, నగర అధికార ప్రతినిధి ఆల్ఫా కృష్ణ, నగర మైనార్టీ సెల్ కన్వీనర్ మహ్మద్ షరీష్, బీసీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు పక్కి దివాకర్, పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొండా రాజీవ్‌గాంధీ, రాష్ట్ర యువజన విభాగం ప్రచార కార్యదర్శి తుళ్లి చంద్రశేఖర్ యాదవ్, గాజువాక మాజీ కౌన్సిలర్ పల్లా చినతల్లి, సీనియర్ నేత పల్లా పెంటారావు, మాజీ సర్పంచ్ బట్టు సన్యాసిరావురెడ్డి, 56వ వార్డు అధ్యక్షుడు జి.పూర్ణ, చిన్ని తదితర నాయకులు కలుసుకున్నారు. ఆయనను తిలకించడానికి పెద్ద సంఖ్యలో అభిమానులు, ప్రయాణికులు, యువకులు ఎగబడ్డారు. సెల్ఫీలు తీసుకోడానికి ఆరాటపడ్డారు.
గురువులూ.. గుడ్..
సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువులను పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. రెండు రోజుల శ్రీకాకుళం జిల్లా పర్యటనను ముగించుకుని విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న జగన్‌మోహన్‌రెడ్డిని గురువులు శనివారం సాయంత్రం కలిశారు.
ఈ సందర్భంగా తమ నియోజకవర్గంలో గడపగడపకు వైఎస్సార్‌సీపీ కార్యక్రమాన్ని 180 రోజులపాటు నిరాటంకంగా నిర్వహించినట్టు జగన్‌కు చెప్పారు. అలాగే బూత్ కమిటీల నియామకాన్ని కూడా పూర్తి చేశామని వివరించారు. వీటిని పుస్తక రూపంలో తయారు చేసి త్వరలోనే అందజేస్తానని జగన్‌కు చెప్పారు. దీంతో “వెల్డన్ గురువులు అన్నా.. బాగా చేస్తున్నారు’ అంటూ జగన్ అభినందించారు.