వీరికెక్కడిది అర్హత? | YS Rajasekhara Reddy name change udayana university tdp | Sakshi
Sakshi News home page

వీరికెక్కడిది అర్హత?

Published Mon, Dec 15 2014 12:38 AM | Last Updated on Mon, Sep 17 2018 7:38 PM

వీరికెక్కడిది అర్హత? - Sakshi

వీరికెక్కడిది అర్హత?


 ఉద్యాన వర్సిటీ... ఈ పేరు దేశంలో ఒక్క హిమాచల్‌ప్రదేశ్‌లో వినిపించేది. తక్కువ సాగునీటితో, వాణి జ్యపు విలువలున్న ఉద్యాన పంటలను రైతు పండించాలంటే ఉద్యాన అధికారుల సహాయ సహకారాలు అవసరం. ఇలాంటి వర్సిటీ ఉన్న ప్రాంతంలోని రైతుల కళ్లల్లో సంతోషం తెలుసుకున్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సాహసోపేత నిర్ణయంతో దేశంలో రెండవదిగా జిల్లాలోని వెంకట్రామన్నగూడెంలో ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఉదాత్త ఆశయంతో డాక్టర్ వైఎస్ హయాంలో ఏర్పాటయిన వర్సిటీకి ఆయన మరణానంతరం.. ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్‌కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ఉద్యాన వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీగా ప్రత్యేక జీఓ ద్వారా మార్చారు. అలాంటి పేరును మార్చాలని శనివారం జరిగిన జెడ్పీ సమావేశంలో తెలుగుదేశం ప్రజా ప్రతినిధులుతీర్మానం చేయడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి రావడానికి రైతులకు, డ్వాక్రా మహిళలకు, నిరుద్యోగులకు, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకుండా, జనాన్ని ముప్పుతిప్పల పాలు చేస్తున్న టీడీపీ నేతలకు.. రైతుల కోసం ఏకంగా ఉద్యాన వర్సిటీని ఏర్పాటు చేసిన వైఎస్ పేరును తీసివేయమనే అర్హత లేదంటున్నారు.
 
 తాడేపల్లిగూడెం :వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీలో విద్య, పరిశోధన, విస్తరణ కోసం నాలుగు కళాశాలలు, ఐదు పాలిటెక్నిక్ కళాశాలలు, 27 పరిశోధనాలయాలు ఉన్నాయి. నాలుగు వందల మంది ప్రొఫెసర్లు పనిచేస్తున్నారు. అధికార్లు ,రైతుల సేవ కోసం  400 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. ఏటా పరిశోధనల కోసం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్),
 
 డిపార్టుమెంటు ఆఫ్ కమ్యూనికేషన్, హెచ్‌ఆర్ మినిస్ట్రీ, యూజీసీ వంటి సంస్థల నుంచి ఏటా కోట్ల రూపాయలు రైతుల కోసం చేసే పరిశోధనల కోసం వర్సిటీకి వస్తున్నాయంటే అది వైఎస్ ముందుచూపుతో వ్యవహరించడం వల్లే. నాబార్డు నుంచి దేశంలోనే తొలిసారిగా ఒక యూనివర్శిటీకి రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంటు ఫండ్ (ఐఆర్‌డీఎఫ్) ఇస్తున్నారంటే అదీ వైఎస్ చలవే. వర్సిటీ నడిచేది రాష్ట్ర ప్రభుత్వం దయాధర్మాల మీద కాదు, వర్సిటీ కార్యకలాపాల కోసం అయ్యే వ్యయంలో 80 శాతం నిధులు కేంద్రం నుంచి వస్తున్నాయంటే అది వైఎస్ దార్శనికతకు నిదర్శనం. కేవలం 20 శాతం నిధులను రాష్ట్రం వర్శిటీకి విడుదల చేస్తే , ఇక్కడ జరిగే ప్రయోగాల ఫలాలు , రాష్ట్రంలోని రైతులతో పాటు, దేశంలోని రైతులకు అందుతున్నాయంటే అది వైఎస్ విజన్. ఇక్కడ విద్యనభ్యసించిన వారికి అంతర్జాతీయ సంస్థలలో ఉద్యోగావకాశాలు గత కొంత కాలంగా లభిస్తున్నాయంటే, ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ముందుచూపుతో ఏర్పాటు చేసిన ఉద్యాన వర్శిటీ వల్లే. అలాంటి మహనీయుని పేరును ఉద్యాన వర్సిటీకి తీసి వేయమని తీర్మానం చేసే అర్హత తెలుగు దేశం ప్రజా ప్రతినిధులకు లేదని పలువురు విమర్శిస్తున్నారు.
 
 ఉద్యానం ఈ పేరే వైఎస్
 అవిభక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఉద్యాన విభాగం ఒకటి మాత్రమే ఉండేది. భవిష్యత్‌లో సాగునీటి కొరత ఉంటుందని నిపుణులు అభిప్రాయాలను వ్యక్తం చేసిన సందర్భంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ రైతుల కోసం ఉద్యాన వర్సిటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు .2007 జూన్ 26న జీఓ 134 ద్వారా పశ్చిమగోదావరి జిల్లాలో దేశంలో రెండో దైన ఉద్యాన వర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. వెంకట్రామన్నగూడెం, మహబూబ్‌నగర్ జిల్లా మోజర్ల, కడప జిల్లా అనంతరాజుపేట, రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో నాలుగు కళాశాలలు ఏర్పాటు చేసి, 2007-08 విద్యా సంవత్సరం నుంచి ఉద్యాన యుజీ, పీజీ కోర్సులను ప్రారంభించారు. ఐపీఏఆర్ సౌజన్యంతో కృషి విజ్ఞాన కేంద్రాలు వచ్చాయి. 2008 ఫిబ్రవరి 16న వర్సిటీకి తొలి పాలక మండలి ఏర్పాటయ్యింది. తొలి వైస్ చాన్సలర్‌గా ప్రపంచవ్యాప్త కీర్తి నార్జించిన డాక్టర్ శిఖామణి ఉపకులపతిగా వచ్చారు. వర్సిటీకి అనుబంధంగా 27 రీసెర్చ్ స్టేషన్లలో ప్రస్తుత పరిస్థితుల కనుగుణంగా ప్రయోగాలు జరిగి రైతులు ప్రయోజనం పొందారంటే అది ైవె ఎస్ చలవే.
 
 వైఎస్ కోసం
 దార్శనికుడు, రైతు పక్షపాతి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి దివి కేగడంతో, ఆయన కృషి ఫలితంతో ఏర్పాటై, రాష్ట్రానికి దేశంలో పేరు తీసుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉద్యాన విశ్వవిద్యాలయం పేరును డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన వర్సిటీగా మార్చారు. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నాయకత్వంలో కేబినెట్ ప్రత్యేకంగా సమావేశమై వైఎస్ సేవలకు గుర్తింపుగా 2011 ఆగస్టు ఒకటో తేదీన 198 జీఓ ద్వారా వర్సిటీ పేరును డాక్టర్ వైఎస్‌ఆర్ ఉద్యాన యూనివర్సిటీగా మార్చి రుణం తీర్చుకుంది. అలాంటి మహనీయుని పేరును తీసివేయమని టీడీపీ పాలకులు మాట్లాడటంపై రైతు లోకం దుమ్మెత్తి పోస్తోంది.
 
 కోట్ల నిధులు
వైఎస్‌ విజన్‌తో రూపుదిద్దుకొన్న వర్సిటీకి నాన్ టీచింగ్ స్టాఫ్ జీత భత్యాలు, కంటింజెన్సీ, నిర్వహణ ఖర్చుల కింద రూ. 50 కోట్లు వస్తున్నాయి. టీచింగ్ స్టాఫ్ జీతభత్యాల కోసం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి రూ. 60 కోట్లు వస్తున్నాయి. నాబార్డు నుంచి మౌలిక వసతుల కల్పన కోసం నిధులు వస్తున్నాయి. పరిశోధనల కోసం ఐసీఏఆర్ నుంచి, డిపార్టుమెంటు ఆఫ్ సైన్స్ అండ్ కమ్యూనికేషన్స్ నుంచి, మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి, గ్ర ంథాలయాల నిర్వహణ కోసం కేంద్రం నుంచి నిధులు వచ్చి, విద్యార్థులు, శాస్త్రవేత్తలు నిత్యం రైతుల కోసం ప్రయోగాలు చేయగలుగుతున్నారంటే అది వైఎస్ హయాంలో ఏర్పడిన ఉద్యాన వర్సిటీ వల్లే. ఇలాంటి వర్సిటీ పేరును మార్చమనే హక్కు, అర్హత ప్రస్తుత పాలకులకు లేద ంటున్నారు.
 
 వైఎస్ కృషితో ఫలాలు రైతులకు చేరాయి
 మామిడి, మిర్చి, బత్తాయి వంటి వాటిలో అధిక దిగుబడులు సాధించడానికి వర్సిటీలో రూపొందించిన వంగడాలు దోహదం చేశాయి. కడియం వంటి ఒకే ప్రదేశంలో వేల నర్సరీలు కలిగిన ప్రాంతంలో పూల పరిశోధన కోసం డెరైక్టరేట్ ఆఫ్ ఫ్లోరీకల్చర్‌కు అనుబంధంగా మరో పరిశోధనా స్థానం రానున్నదంటే అది వైఎస్ రైతుల కోసం ఆలోచించి, ఏనాడో నాటిన విత్తనం ఫలాలు ఈనాడు రైతులకు అందడం వ ల్లే. రైతు మంత్రమే కాని , వారికి పనికి వచ్చే పనులు చేయకుండా ఇబ్బందులు పెడుతున్న పాలకులకు వైఎస్ పేరు తొలగించమనే అర్హత లేదనే విమర్శలు మిన్నంటుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement