దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, ప్రజలు ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు.
కర్నూలు(ఓల్డ్‌సిటీ): దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి 66వ జయంతి వేడుకలను జిల్లా అంతటా ఘనంగా నిర్వహించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అభిమానులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్ చేసిన అభివృద్ధి పనులను స్మరించుకున్నారు.
కర్నూలు ఎస్వీ కాంప్లెక్స్ సమీపంలోని వైఎస్ విగ్రహానికి ఎమ్మెల్యేలు ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంధీ, మాజీ ఎమ్మెల్యే కొత్త కోట ప్రకాశ్‌రెడ్డిలతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. అంతకు ముందు స్థానిక భాగ్యనగర్‌లోని పార్టీ కార్యాలయంలో భారీ కేక్ కట్‌చేసి విగ్రహానికి పూలమాలలు వేశారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరుచరితారెడ్డి, పార్టీ మాజీ కన్వీనర్ గౌరు వెంకటరెడ్డిల ఆధ్వర్యంలో కల్లూరు పరిధిలోని షరీన్‌నగర్‌లో ఉన్న వైఎస్ విగ్రహానికి పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఆదోనిలో ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.నంద్యాలలోని భూమా నాగిరెడ్డి నివాసంలో వైఎస్ జ యంతి వేడుకలను కార్యకర్తలు ఘనంగా జరుపుకున్నారు.
నందికొట్కూరులో ఎమ్మెల్యే ఐజయ్య, మండల కన్వీనర్ల ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఆలూరులో ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, పార్టీ మండల కన్వీనర్ చిన్న ఈరన్న ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఎమ్మిగనూరులో పార్టీ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ఎర్రకోట జగన్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.
పత్తికొండలో పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపాలు లక్ష్మినారాయణరెడ్డి, పత్తిపాడు సర్పంచ్ మురళీధర్‌రెడ్డి వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఆత్మకూరులోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధికార ప్రతినిధి పాండురంగచౌదరి ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేశారు.నల్లకాలువ సమీపంలోని స్మృతి వనంలో అటవీ శాఖ సిబ్బంది నివాళులు ర్పించారు. డోన్‌లో సింగిల్‌విండో అధ్యక్షుడు సోమేశ్‌యాదవ్ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కోవెలకుంట్లలో పార్టీ మండల కమిటీ అధ్యక్షుడు రామేశ్వరరెడ్డి, ఎంపీటీసీ ప్రతాప్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. బనగానపల్లెలో కాటసాని రామిరెడ్డి సోదరుడు కాటసాని చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో ైనివాళులు అర్పించారు. కోడుమూరులో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
జోహార్ వైఎస్‌ఆర్
Published Thu, Jul 9 2015 2:29 AM | Last Updated on Sat, Jul 7 2018 2:56 PM
Advertisement
Advertisement