జోహెనస్‌బర్గ్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం | YSR Congress Party leaders Celebrates their Victory at Johannesburg | Sakshi
Sakshi News home page

జోహెనస్‌బర్గ్‌లో వైఎస్సార్‌సీపీ విజయోత్సవం

Published Mon, May 27 2019 4:21 AM | Last Updated on Mon, May 27 2019 9:44 AM

YSR Congress Party leaders Celebrates their Victory at Johannesburg - Sakshi

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌సీపీ భారీ మెజారిటీతో గెలిచిన నేపథ్యంలో సౌత్‌ ఆఫ్రికాలోని జోహెనస్‌బర్గ్‌లో ఆదివారం వైఎస్సార్‌సీపీ విజయోత్సవ సభను నిర్వహించారు. పార్టీ నాయకులు, అభిమానులు ఉదయం 10గంటలకు కారు ర్యాలీని నిర్వహించి సంబురాలు జరుపుకున్నారు.

దక్షిణ్‌ ఇండియన్‌ రెస్టారెంట్‌లో జరిగిన ఈ వేడుకలో అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారీ కేక్‌ను కట్‌ చేసి జై వైఎస్సార్, జై జగన్‌ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో సౌత్‌ ఆఫ్రికా వైఎస్సార్‌సీపీ నాయకులు కల్ల నరసింహారెడ్డి, సూర్య రామిరెడ్డి, వెంకట్‌ మాగంటి, విక్రమ్‌ కుమార్‌ పెట్లూరు, మోహన్, దినేశ్, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement