
వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ
ఇదే స్ఫూర్తితో ప్రజలకు చేరువకండి
రాజా, సునీల్, కన్నబాబులకు జగన్ సూచన
వైఎస్సార్‌సీపీకి పెరుగుతున్న ప్రజాదరణ
కాకినాడ : వైఎస్సార్‌సీపీకి ప్రజల్లో రోజురోజుకి ఆదరణ పెరుగుతోందని, నాయకులు కూడా నిత్యం ప్రజల వెంటే ఉంటూ సమస్యలపై పోరాడాలని ప్రతిపక్షనేత, పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డి పిలుపునిచ్చారు. తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, ఇటీవల వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, కాకినాడ పార్లమెంట్ కో-ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్ బుధవారం హైదరాబాద్‌లో పార్టీ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా జగన్‌మోహన్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో పార్టీకి మంచి ఆదరణ కనిపిస్తోందన్నారు. త్వరలో కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలు కూడా రానున్నందున పార్టీ పటిష్టత కోసం పనిచేస్తూ ప్రజా సమస్యలపై పోరుబాట పట్టాలని పిలుపునిచ్చారు. అలాగే జిల్లాకు సంబంధించిన మరికొన్ని ఇతర అంశాలపై కూడా ఆయన నేతలతో చర్చించారు.