
చెరగని సంతకం
సాక్షి, ఏలూరు : ‘నమస్తే చెల్లెమ్మా.. నమస్తే అక్కయ్యా.. నమస్తే అన్నయ్యా.. నమస్తే తమ్ముడూ.. నమస్తే.. నమస్తే...’ జిల్లా ప్రజల చెవుల్లో నేటికీ ఈ మాటలు ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. జనం గుండెల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి రూపం సజీవంగానే ఉంది. చిన్నారి గుండెకు చిల్లుపడితే లక్షలాది రూపాయలు వెచ్చిం చి నిండు నూరేళ్ల జీవితాన్ని ఇచ్చిన మహానేత.. పండుటాకులకు పెద్ద కొడుకై వారి సంరక్షణ బా ధ్యత తీసుకున్న ప్రజల మనిషి.. ప్రపంచమంత ప్రేమను దక్కించుకున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజు నేడు. ఆ మహానేతను తలచుకుని ‘రాజన్నా మళ్లీ రావయ్యా.. నీవు లేక జనం కష్టాలు పడుతున్నారు చూడయ్యా’ అంటూ ప్రజలు ఆయనను పిలుస్తున్నారు. మా బాధల్లో.. మా సంతోషంలో ఎప్పటికీ జీవించే ఉండే నీవు ఎక్కడికి పోతావు రాజన్నా అంటూ కన్నీరు పెడుతున్నారు.
ప్రాణాలు నిలిపిన సంక్షేమ పథకాలు
వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన ఒక్క సంతకం రైతులను విద్యుత్ చార్జీల నుంచి విముక్తుల్ని చేసింది. లక్షలాది రైతుల కుటుంబాల్లో వెలుగులు నింపింది. వ్యవసాయానికి రోజుకు 7 గంటలపాటు ఉచిత విద్యుత్ అందించడంతోపాటు అప్పటివరకూ ఉన్న విద్యుత్ బకాయిలను వైఎస్ రద్దు చేశారు. ఆయన మన జిల్లాకు వచ్చినప్పుడు తత్కాల్‌లో సర్వీసులు పొందిన వారు కూడా ఉచిత విద్యుత్ అందించమని కోరగా.. వారికి కూడా ఆ పథకాన్ని వర్తింపజేస్తూ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో విద్యుత్ బిల్లులు కట్టలేక కష్టాల్లో ఉన్న రైతన్నలకు వైఎస్ ఇచ్చిన ఉచిత విద్యుత్ వరంగా మారి వ్యవసాయాన్ని పండగలా మార్చేసింది. టీడీపీ అధికారంలో ఉన్న తొమ్మిదేళ్లలో 11,553 సర్వీసులు ఇస్తే, వైఎస్ అధికారంలో ఉన్న ఐదున్నరేళ్లలో 15,449 వ్యవసాయ విద్యు త్ సర్వీసులు ఇచ్చారు.
పోలవరం పూర్తరుుతే...
పోలవరం మండలం రామయ్యపేట లో నిర్మిస్తున్న ఇందిరాసాగర్ ప్రాజెక్టు పూర్తయితే ఉభయగోదావరి, కృష్ణా, విశాఖ జిల్లాల్లో 7.20 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది. 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుం ది. 80 టీఎంసీల గోదావరి నీటిని కుడి ప్రధాన కాలువ ద్వారా కృష్ణా నదికి, 23.44 టీఎంసీల నీటిని ఎడమ కాలువ ద్వారా విశాఖ పరిసర 560 గ్రామాల తాగునీటి, సాగునీటి, పరిశ్రమల అవసరాలకు సరఫరా చేస్తారు. ఈ నాలుగు జిల్లాల్లో పర్యాటకం, చేప ల పెంపకం, జలరవాణా వంటివి అభివృద్ధి చెందుతాయి. రూ.16,010 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణానికి అనుమ తి తీసుకువచ్చిన ఘనత వైఎస్ రాజశేఖరరెడ్డిదే. కేంద్రంతో పోరాడి దీని నిర్మాణంలో కదలిక తెచ్చారు. నిధు లు కేటాయించడంతోపాటు, అన్ని అనుమతులు సాధించారు. ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, అభయహస్తం, పంట రుణాలమాఫీ, విద్యుత్ బకాయిల రద్దు, ‘108’, 104 వంటి పథకాలు వైఎస్ చలవే. ఆయన హయాంలో ప్రకృతి కన్నెర్రజేస్తే రైతులకు క్షణాల మీద సాయం అం దేది. వంటింటికే పరిమితమైన అడపడుచులకు ఆర్థిక స్వావలంబన లభిం చింది. పావలా వడ్డీ రుణాలు ఇచ్చి వారి వెతలు తీర్చారు.
అభివృద్ధికి ప్రజలే ‘సాక్షి’
ఏలూరు నగరంలోని వన్‌టౌన్‌లో భూగర్భ డ్రెరుునేజీ అభివృద్ధి పనులకు మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లో రూ.17.30కోట్లు నిధులు విడుదల చేశారు. తమ్మిలేరు ఏటిగట్లు పటిష్టం చేసే పనులు చేపట్టారు. ఏటా తమ్మిలేరు వరద ముంపుతో అతలాకుతలం అవుతున్న ఏలూరు నగరం, పరిసర గ్రామాలను కాపాడటానికి ఏలూరులోని పడమర లాకుల నుంచి రూ.25 కోట్లతో ఏటిగట్లను పటిష్టంచేసే పనులు వైఎస్ మం జూరు చేశారు. రూ.85 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు నిర్మించారు. ఐదు ప్రాం తాల్లో 10వేల మందికి ఇళ్లు సమకూరాయంటే ఆయన చలవే. నగరంలో రూ.4కోట్లతో మూడుచోట్ల వంతెనలు, హాకర్స్ జోన్, రూ.6 కోట్లతో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా అభివృద్ధి పనులు వైఎస్ హయాంలోనే జరిగాయి.
దేవరపల్లి మండలం శివారు బందపురం వద్ద తాడిపూడి కాలువపై గోపాలపురం, దేవరపల్లిలో సబ్ లిఫ్ట్ పనులకు 2008లో సుమారు రూ.48 కోట్లను వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూ రు చేశారు. ఉండి కాలువపై అక్విడెక్ట్ నిర్మాణానికి 2009 ఫిబ్రవరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారు. తాడేపల్లిగూడెం పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రెరుునేజీ పనులకు రూ.64 కోట్ల కేటాయించారు. 2008, జనవరి 31న ఆచంట నియోజకవర్గంలో పర్యటన సందర్భంగా రూ.14కోట్లు ఖర్చ య్యే సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేశారు. తణుకు శివారు అజ్జరం పుంత ఇందిరమ్మ కాలనీలో 400 ఇళ్లు నిర్మించారు. నరసాపురంలో వైఎస్సార్ నగర్‌లో 250 ఇళ్లు కట్టించారు. పాలకొల్లు మండ లం తిల్లపూడిలో రూ.2 కోట్లతో ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి 1100 ఎకరాలకు నీరు అందేలా చేశారు.