అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణమండపంలో సోమవారం వైఎస్సార్ సీపీ ఉత్తర నియోజకవర్గం కార్యకర్తలు సమావేశమయ్యారు.
విశాఖ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తర నియోజకవర్గం కార్యకర్తల సమావేశం సోమవారం అక్కయ్యపాలెం షాదీఖానా కళ్యాణ మండపంలో జరిగింది. చంద్రబాబు నాయుడు చేసే మోసాలకు, వంచనకు నిరసన తెలుపుతూ నవంబరు 5న అన్ని మండల కేంద్రాల్లో వైఎస్ఆర్ సీపీ నిరసనలు చేపట్టనున్న విషయం తెలిసిందే. జిల్లా ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ధర్నా కార్యచరణపై చర్చించారు.