ఆడ్-ఈవెన్ వెబ్ సైట్ ను అమ్మేసిన అక్షిత్ | 13-year-old creator of Odd-even.com Akshat Mittal sells his company to Orahi.com | Sakshi
Sakshi News home page

ఆడ్-ఈవెన్ వెబ్ సైట్ ను అమ్మేసిన అక్షిత్

Published Tue, Apr 5 2016 12:57 PM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM

ఆడ్-ఈవెన్ వెబ్ సైట్ ను అమ్మేసిన అక్షిత్

ఆడ్-ఈవెన్ వెబ్ సైట్ ను అమ్మేసిన అక్షిత్

బెంగళూరు : ఢిల్లీలో కాలుష్య నివారణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన సరి, బేసి విధానాన్ని మనమందరం విన్నాం. కాలుష్య నివారణలో ఈ విధానం విజయవంతమై, దేశమంతటికీ ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విధాన అమలు కోసం ఆడ్-ఈవెన్ డాట్ కామ్ వెబ్ సైట్ ను రూపొందించి, ఢిల్లీ ప్రజలకు సాయ పడింది ఓ 13 ఏళ్ల కుర్రాడే.

కేజ్రీవాల్ ఈ విధానాన్ని ప్రకటించగానే, ఆడ్ ఈవెన్ డాట్ కామ్ వెబ్ సైట్ ను అక్షత్ మిట్టల్ రూపొందించాడు. అమితీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంటున్న ఈ కుర్రాడు ఈ వైబ్ సైట్ కు టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు మెంబర్ గా పనిచేసి ఇటు ఢిల్లీ ప్రజలకు, అటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనం చేకూర్చాడు.

 దాదాపు 30 వేల మంది ఈ వైబ్ సైట్ లో తమ పేరు, వాహనాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. కొద్ది కాలంలోనే ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ద్వారా సెలబ్రిటీ అయిన ఆ కుర్రాడు చాలా ధనవంతుడు కూడా అయ్యాడు. అయితే ఇప్పడు ఆ వెబ్ సైట్ ను కార్ పూల్ యాప్ ఓరాహి డాట్ కామ్ కు అక్షిత్ అమ్మేశాడు. భారీ మొత్తానికి ఈ డీల్ జరిగినట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement