odd-even.com
-
ఈసారి మరో ఆలోచనతో అక్షత్
న్యూఢిల్లీ: ఆడ్ ఈవెన్ డాట్ కామ్ వ్యవస్థాపకుడు అక్షత్ మిట్టల్ గుర్తున్నాడా? దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కాలుష్య నివారణ కోసం కేజ్రీవాల్ సర్కారు ప్రవేశపెట్టిన సరి–బేసి విధానం వల్ల వాహనదారులకు ఎదురయ్యే ఇబ్బందులను పరిష్కరించేందుకు వెబ్‌సైట్‌ను 13 ఏళ్ల వయసులోనే ప్రారంభించి అందరి మన్ననలు పొందిన అక్షత్ మరో అద్భుతమైన యాప్‌ను రూపొందించాడు. ప్రస్తుతం 15 ఏళ్ల వయసున్న అక్షత్ మిట్టల్... ప్రజల రోజువారీ సమస్యలను పరిష్కరించేందుకు ‘చేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్’ పేరున కొత్త వెంచర్‌ను ఆవిష్కరించాడు. ‘ఓరాహీ’ సలహా బోర్డుతో కలిసి రూపొందించిన ఈ యాప్ ద్వారా.. దైనందిన జీవితంలో భారత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కరించేందుకు అక్షత్ కొత్త యాప్.. చేంజ్ మై ఇండియా డాట్ ఆర్గ్... పనిచేయనుంది. సమాజంలో మార్పు కోరుకునేవారు, అందుకు సాయం అందించే ఆసక్తి ఉన్నవారితో కలిసి.. దాదాపు పది లక్షల మంది సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నాడు. -
ఆడ్-ఈవెన్ వెబ్ సైట్ ను అమ్మేసిన అక్షిత్
బెంగళూరు : ఢిల్లీలో కాలుష్య నివారణకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ప్రవేశపెట్టిన సరి, బేసి విధానాన్ని మనమందరం విన్నాం. కాలుష్య నివారణలో ఈ విధానం విజయవంతమై, దేశమంతటికీ ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ విధాన అమలు కోసం ఆడ్-ఈవెన్ డాట్ కామ్ వెబ్ సైట్ ను రూపొందించి, ఢిల్లీ ప్రజలకు సాయ పడింది ఓ 13 ఏళ్ల కుర్రాడే. కేజ్రీవాల్ ఈ విధానాన్ని ప్రకటించగానే, ఆడ్ ఈవెన్ డాట్ కామ్ వెబ్ సైట్ ను అక్షత్ మిట్టల్ రూపొందించాడు. అమితీ ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుకుంటున్న ఈ కుర్రాడు ఈ వైబ్ సైట్ కు టెక్నికల్ అడ్వయిజరీ బోర్డు మెంబర్ గా పనిచేసి ఇటు ఢిల్లీ ప్రజలకు, అటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో ప్రయోజనం చేకూర్చాడు. దాదాపు 30 వేల మంది ఈ వైబ్ సైట్ లో తమ పేరు, వాహనాన్ని రిజిస్టర్ చేసుకున్నారు. కొద్ది కాలంలోనే ఆడ్ ఈవెన్ డాట్ కామ్ ద్వారా సెలబ్రిటీ అయిన ఆ కుర్రాడు చాలా ధనవంతుడు కూడా అయ్యాడు. అయితే ఇప్పడు ఆ వెబ్ సైట్ ను కార్ పూల్ యాప్ ఓరాహి డాట్ కామ్ కు అక్షిత్ అమ్మేశాడు. భారీ మొత్తానికి ఈ డీల్ జరిగినట్టు సమాచారం.