న్యూఢిల్లీ: సిమెంటు దిగ్గజం ఏసీసీ ఈ ఏడాది ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో రూ. 329 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ప్రకటించింది. గతేడాది ఇదే వ్యవధిలో నమోదైన రూ. 326 కోట్లతో పోలిస్తే స్వల్ప వృద్ధి సాధించింది. ఏసీసీ జనవరి–డిసెంబర్ కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా వ్యవహరిస్తుంది. దీని ప్రకారం ఈ ఏడాది ఏప్రిల్–జూన్ మధ్య కాలం రెండో త్రైమాసికం అవుతుంది. క్యూ2లో కంపెనీ నికర అమ్మకాలు విలువపరంగా రూ. 3,329 కోట్ల నుంచి రూ. 3,768 కోట్లకు పెరిగాయి.
సిమెంటు విక్రయాలు 6.74 మిలియన్ టన్నుల నుంచి 7.24 మిలియన్ టన్నులకు చేరాయి. విక్రయాల్లో వృద్ధి సాధించినప్పటికీ.. ముడివస్తువుల ధరలు, రవాణా చార్జీలు గణనీయంగా పెరగడం వల్ల వ్యయాలపరమైన సవాళ్లు కొనసాగుతున్నాయని ఏసీసీ ఎండీ నీరజ్ అఖోరి తెలిపారు. ఈ నేపథ్యంలో సిమెంటు, రెడీమిక్స్ వ్యాపార విభాగాలను పటిష్టం చేసుకోవడంతో పాటు కొత్త ఆదాయ మార్గాలపైనా దృష్టి సారిస్తున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment