నెల రోజుల కనిష్టానికి రూపాయి
ముంబై: చమురు దిగుమతి సంస్థల నుంచి డాలర్లకు డిమాండ్ వెల్లువెత్తడంతో రూపాయి మారకం విలువ దాదాపు నెల రోజుల కనిష్టానికి క్షీణించింది. డాలర్‌తో పోలిస్తే ఏకంగా 30 పైసలు తగ్గి 60.59 వద్ద ముగిసింది. సోమవారం ఫారెక్స్ మార్కెట్లో ఒక దశలో 60.61 స్థాయికి కూడా రూపాయి విలువ పతనమైంది. చివరికి అరశాతం క్షీణతతో ముగిసింది. దిగుమతి సంస్థలు..ముఖ్యంగా చమురు కంపెనీలు నెలాఖరులో జరపాల్సిన చెల్లింపుల కోసం డాలర్లను భారీగా తీసుకోవడంతో రూపాయి విలువ క్షీణించినట్లు నిపుణుల వ్యాఖ్య.