ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ !
ముంబై: ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశీయ విమాన టికెట్ల ధరల్లో యాభై శాతం రాయితీని తాజాగా కల్పించింది. సంక్రాతి పండుగను దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల్నిమరింతి ఆకర్షించేందుకు ఎయిర్ ఇండియా విమాన టికెట్ల ధరలను సరళతరం చేసింది. దీంతో టికెట్ కనిష్టంగా రూ.1,557 కే లభించనుంది.
సోమవారం నుంచి ప్రారంభమైన రాయితీ బుకింగ్ జనవరి 18 వరకూ అందుబాటులో ఉంటుందని ఎయిర్ ఇండియా స్పష్టం చేసింది. ఈ ఆఫర్ జనవరి 16 నుంచి ఏప్రిల్ 30వ తేదీల మధ్య ప్రయాణించే వారికి మాత్రమే.