
న్యూఢిల్లీ: టెలికం కంపెనీ భారతీ ఎయిర్‌టెల్.. ‘ఎక్స్‌స్ట్రీమ్ ఫైబర్’ పేరుతో అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను బుధవారం ప్రారంభించింది. గృహాలు, ఎస్‌ఓహెచ్‌ఎం (స్మాల్ ఆఫీస్ హోమ్ ఆఫీస్), చిన్న వాణిజ్య సంస్థల కోసం రూ. 3,999 నెలవారీ చందాకే తాజా సేవలను అందుబాటులోకి తెచి్చంది. ప్రస్తుతం ఈ సేవలు ఢిల్లీ, హైదరాబాద్, ముంబై, పుణే, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఇండోర్, జైపూర్, అహ్మదాబాద్, ఫరీదాబాద్, నోయిడా, ఘజియాబాద్, గుర్గావ్, చండీగఢ్ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్నట్లు ప్రకటించింది. ఈ ప్యాకేజీలో ఎయిర్‌టెల్ థ్యాంక్స్ ప్రయోజనాలు ఉన్నట్లు వివరించింది. ఇందులో భాగంగా దేశంలోని అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ ల్యాండ్‌లైన్ కాల్స్ ఉచితంగా అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment