
ముంబై: టెలికం రంగంలో ఉద్యోగాల కోత... ఈ వార్తను ఇటీవల కాలంలో తరచూ చూస్తున్నాం. ఇది ఆందోళనకరమైన అంశమని, ఈ రంగంలో ఉద్యోగం కోల్పోయిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించటానికి ప్రయత్నిస్తున్నామని టెలికం శాఖ అత్యున్నత స్థాయి అధికారి ఒకరు చెప్పారు. టెలికంలో ఉద్యోగాల కోత 90,000గా ఉండొచ్చనే అంచనాలున్న నేపథ్యంలో టెలికం కార్యదర్శి అరుణ సుందరరాజన్ మాట్లాడుతూ... ‘‘ప్రత్యామ్నాయాలు మూడు స్థాయిల్లో ఉంటాయి.
రిటైల్ ఔట్‌లెట్స్ వంటి దిగువ స్థాయిలో ఉన్నవారిపై తొలుత దృష్టి పెడతాం. వారి భవిష్యత్‌కు భరోసానిస్తాం’’ అని చెప్పారామె. శుక్రవారమిక్కడ జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ... టెలికం రంగాన్ని స్థిరీకరించడమే తొలి ప్రాధాన్యమని, కొత్త టెలికం పాలసీతో ఇది సాధ్యమవుతుందని చెప్పారు. ‘భారత్‌నెట్, పబ్లిక్ వై–ఫై తదితరాల ద్వారా నూతన ఉపాధి అవకాశాలను సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాం. దిగువ స్థాయిలో ఉన్న వారికి కొత్త అవకాశాలను అందిస్తాం’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment