
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: స్టాండలోన్ ఫలితాల్లో అమరరాజా నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.134 కోట్ల నుంచి రూ.129 కోట్లకు వచ్చి చేరింది. టర్నోవరు రూ.1,570 కోట్ల నుంచి రూ.1,707 కోట్లకు ఎగసింది. ఏప్రిల్–డిసెంబరు పీరియడ్‌లో రూ.5,267 కోట్ల టర్నోవరుపై రూ.363 కోట్ల నికరలాభం ఆర్జించింది.
హెచ్‌బీఎల్ పవర్ లాభం రూ.7.3 కోట్లు..
క్యూ3లో హెచ్‌బీఎల్ పవర్ సిస్టమ్స్ నికరలాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రూ.7.4 కోట్ల నుంచి రూ.7.3 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.417 కోట్ల నుంచి రూ.314 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్–డిసెంబరులో రూ.958 కోట్ల టర్నోవరుపై రూ.18 కోట్ల నికరలాభం సాధించింది.
రెండింతలైన ఆంధ్రా సిమెంట్స్ నష్టాలు..
గడిచిన త్రైమాసికంలో ఆంధ్రా సిమెంట్స్ నష్టం క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే రెండింతలకుపైగా పెరిగి రూ.79 కోట్లు నమోదు చేసింది. టర్నోవరు రూ.114 కోట్ల నుంచి రూ.75 కోట్లకు వచ్చి చేరింది. ఏప్రిల్–డిసెంబరు పీరియడ్‌లో రూ.247 కోట్ల టర్నోవరుపై రూ.146 నష్టం నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment