జన ధన కింద 5.27 లక్షల ఖాతాలు: ఆంధ్రా బ్యాంక్ | Andhra Bank opens 5 lakh accounts | Sakshi
Sakshi News home page

జన ధన కింద 5.27 లక్షల ఖాతాలు: ఆంధ్రా బ్యాంక్

Published Tue, Sep 2 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:43 PM

జన ధన కింద 5.27 లక్షల ఖాతాలు: ఆంధ్రా బ్యాంక్

జన ధన కింద 5.27 లక్షల ఖాతాలు: ఆంధ్రా బ్యాంక్

 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ ఆంధ్రా బ్యాంక్ ప్రధానమంత్రి జన ధన యోజన పథకం కింద ఒకే రోజు 5.27 లక్షల ఖాతాలు ప్రారంభించినట్లు ప్రకటించింది. దేశంలోని 2,147 శాఖల ద్వారా పెద్ద ఎత్తున జన ధన యోజన ఖాతాలు ప్రారంభించడమే కాకుండా వారికి బ్యాంకు ఖాతాల నిర్వహణ, పొదుపుపై అవగాహన పెంచే పుస్తకాల కిట్‌ను అందించినట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 28న జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీడ్ బ్యాంకర్‌గా రాజ మండ్రిలో జరిగిన కార్యక్రమంలో బ్యాంక్ సీఎండీ పాల్గొనగా.. ఉత్తరాంధ్ర, ఒడిశా, తిరుపతిల్లో  ఉన్నతాధికారులు పాల్గొన్నారు. జనవరి, 2015 లోగా కేంద్రం నిర్దేశించిన లక్ష్యాన్ని సులభంగా చేరుకోలమని బ్యాంక్  ధీమా వ్యక్తం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement