యాపిల్ ఐఫోన్ 5సీ 8జీబీ వెర్షన్ | Apple iPhone 5c 8GB arrives in India, to sell at Rs 37500 | Sakshi
Sakshi News home page

యాపిల్ ఐఫోన్ 5సీ 8జీబీ వెర్షన్

Published Sat, May 24 2014 1:26 AM | Last Updated on Sat, Sep 2 2017 7:45 AM

యాపిల్ ఐఫోన్ 5సీ 8జీబీ వెర్షన్

యాపిల్ ఐఫోన్ 5సీ 8జీబీ వెర్షన్

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ తన ఐఫోన్ 5సీలో 8 జీబీ వెర్షన్‌ను శుక్రవారం భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో భారీగా విస్తరిస్తున్న స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై పట్టుసాధించే లక్ష్యంతో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.37,500. ఐఫోన్ 5ఎస్‌తో పాటు 5సీ మోడళ్లను కంపెనీ గత ఆక్టోబర్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసింది.

యూకే, ఫ్రాన్స్‌లలో గతంలోనే ప్రవేశపెట్టిన 8 జీబీ వెర్షన్‌ను ఇపుడు భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ధరలు అధికంగా ఉండడం వల్లే దేశంలో టాప్ 3 కంపెనీల్లో యాపిల్ స్థానం సాధించలేకపోయిందని పరిశ్రమ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చౌక ధరలో స్మార్ట్‌ఫోన్‌ను అందించడం ద్వారా మార్కెట్ వాటాను పెంచుకునేందుకు 5సీలో 8 జీబీ వెర్షన్‌ను యాపిల్ తీసుకువచ్చింది. నాలుగు అంగుళాల రెటీనా డిస్‌ప్లే, ఆపిల్ ఏ6 చిప్‌సెట్, 8 ఎంపీ వెనుక కెమెరా, 1.2 ఎంపీ ముందు కెమెరాతో పాటు ఐఫోన్ 5లోని దాదాపు అన్ని ఫీచర్లూ 5సీలో ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement