యాక్సిస్ బ్యాంక్ లాభం 15% అప్ | Axis Bank Q3 net beats estimates, up 15%; asset quality worsens | Sakshi
Sakshi News home page

యాక్సిస్ బ్యాంక్ లాభం 15% అప్

Published Thu, Jan 21 2016 2:54 AM | Last Updated on Sun, Sep 3 2017 3:59 PM

యాక్సిస్ బ్యాంక్ లాభం 15% అప్

యాక్సిస్ బ్యాంక్ లాభం 15% అప్

క్యూ3లో రూ. 2,175 కోట్లుగా నమోదు
ముంబై: ప్రైవేట్ బ్యాంకింగ్ దిగ్గజం యాక్సిస్ బ్యాంక్ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో 15 శాతం ఎగిసింది. రూ. 2,175 కోట్లుగా నమోదైంది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం క్యూ3లో ఇది రూ. 1,900 కోట్లు. ఇక తాజా క్యూ3లో మొత్తం ఆదాయం రూ. 10,929 కోట్ల నుంచి రూ. 12,531 కోట్లకు పెరిగింది.

ప్రొవిజన్లు పెరిగినప్పటికీ.. నికర వడ్డీ ఆదాయాలు, ఇతర ఆదాయాలు మెరుగుపడటం యాక్సిస్ బ్యాంకుకు తోడ్పడింది. నికర వడ్డీ ఆదాయం 16 శాతం ఎగిసి రూ. 3,590 కోట్ల నుంచి రూ. 4,162 కోట్లుగా నమోదైంది. వడ్డీయేతర ఆదాయం సుమారు 15 శాతం పెరిగి రూ. 2,338 కోట్లకు చేరింది.

మరోవైపు స్థూల నిరర్ధక ఆస్తులు (జీఎన్‌పీఏ) 1.34 శాతం నుంచి 1.68 శాతానికి పెరిగాయి. సెప్టెంబర్ క్వార్టర్‌లో రూ. 4,451 కోట్లుగా ఉన్న జీఎన్‌పీఏలు డిసెంబర్ త్రైమాసికం ఆఖరు నాటికి రూ. 5,724 కోట్లకు ఎగిశాయి. నికర నిరర్ధక ఆస్తులు (ఎన్‌పీఏ) 0.44 శాతం నుంచి 0.75 శాతానికి చేరాయి. ప్రొవిజనింగ్ కోసం రూ. 713 కోట్లు బ్యాంకు పక్కన పెట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో బ్యాంకు నికర లాభం 17 శాతం వృద్ధి చెంది రూ. 5,177 కోట్ల నుంచి రూ. 6,069 కోట్లకు పెరిగింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement