బజాజ్‌ సీటీ 110 @: రూ.37,997 | Bajaj City 110 Launch | Sakshi
Sakshi News home page

బజాజ్‌ సీటీ 110 @: రూ.37,997

Published Tue, Jul 23 2019 11:54 AM | Last Updated on Tue, Jul 23 2019 11:54 AM

Bajaj City 110 Launch - Sakshi

న్యూఢిల్లీ: దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్‌ ఆటో తన ఎంట్రీ లెవెల్‌ మోటార్‌ సైకిల్‌ ‘సీటీ 110’లో నూతన వెర్షన్‌ను విడుదలచేసింది. చౌక ధరలో అధునాతన ఫీచర్లను జోడించిన ఈ బైక్‌ను సోమవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. కిక్‌ స్టార్ట్‌ వెర్షన్‌ ధర రూ.37,997 (ఎక్స్‌–షోరూమ్, ఢిల్లీ) కాగా, ఇందులో ఎలక్ట్రిక్‌ స్టార్ట్‌ ఆప్షన్‌ కలిగిన బైక్‌ ధర రూ.44,480 వద్ద నిర్ణయించినట్లు ప్రకటించింది. ఈ నూతన వెర్షన్‌లో మరింత బలమైన, విశాల క్రాష్‌ గార్డ్స్‌ ఉన్నాయని.. క్రితం మోడల్‌తో పోల్చితే గ్రౌండ్‌ క్లియరెన్స్‌ పెరిగినట్లు వివరించింది. మెరుగైన సస్పెన్షన్‌ కలిగిన ఈ బైక్‌కు 115సీసీ ఇంజిన్‌ అమర్చింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement