
టాప్ టెక్నాలజీ నగరాల్లో బెంగళూరు
20 నగరాల జాబితాలో 12వ స్థానం
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా టెక్నాలజీకి కేంద్రాలుగా నిలుస్తున్న నగరాల జాబితాలో బెంగళూరుకు చోటు దక్కింది. 20 నగరాల జాబితాలో 12వ స్థానంలో నిల్చింది. ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ జోన్స్ లాంగ్ లాసలె (జేఎల్‌ఎల్) నిర్వహించిన సిటీ మూమెంటమ్ ఇండెక్స్ వార్షిక సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. లండన్, శాన్ జోసె, బీజింగ్ నగరాలు ఈ లిస్టులో తొలి మూడు స్థానాల్లోను ఉన్నాయి. టాప్ 20లో చోటు దక్కించుకోలేకపోయినప్పటికీ ఢిల్లీ, ముంబై క్రమంగా మెరుగుపడుతున్నాయి. మెరుగైన ఆర్థిక వృద్ధి, ఇన్‌ఫ్రాలో పెట్టుబడులు, స్టార్టప్‌ల ఏర్పాటు, ఆఫీసులకు సంబంధించి రియల్ ఎస్టేట్ వినియోగం గణనీయంగా ఉండటం తదితర అంశాలు బెంగళూరుకు సానుకూలంగా నిల్చాయని జేఎల్‌ఎల్ ఇండియా చైర్మన్ అనుజ్ పురి తెలిపారు.