సాక్షి, న్యూఢిల్లీ : హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న బయోఫార్మస్యూటికల్స్ సంస్థ భారత బయోటెక్ వ్యాక్సిస్ రోటావాక్‌కు నేషనల్ టెక్నాలజీ అవార్డు దక్కింది. రాష్ట్రపతి చేతుల మీదుగా సంస్థ చైర్మన్ కృష్ణా ఎల్లా ఈ అవార్డును అందుకున్నారు. అతిసారి వ్యాధి నియంత్రణ లక్ష్యంగా ఈ రోటావాక్ వ్యాక్సిన్‌ను బయోటెక్ తయారుచేసింది. భారత్ నుంచి దీన్ని ఉత్పత్తి చేయడమే కాకుండా.. వాణిజ్య పరంగా ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ ఎగుమతులు చేస్తున్నందుకు గాను భారత్ బయోటెక్ ఈ అవార్డు దక్కించుకుంది.
శాస్త్రీయ ఆవిష్కరణ పరంగా ప్రతిభ చూపిస్తూనే అంతర్జాతీయ మార్కెట్‌లో పరిశోధన రంగాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను ఈ అవార్డును అందిస్తున్నట్టు టెక్నాలజీ డెవలప్‌మెంట్ బోర్డు తెలిపింది. కేవలం అతిసార వ్యాధికి సంబంధించిన వ్యాక్సిన్లకు మాత్రమే కాకుండా.. పోలియో నివారణలోనూ భారత్ బయోటెక్ రూపొందించిన వ్యాక్సిన్లకు అంతర్జాతీయంగా మంచి ఆదరణ లభిస్తోందని సంస్థ ప్రతినిధులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment