
టాప్ 500 కంపెనీలు ‘బాధ్యతా’ నివేదికలు ఇవ్వాలి
న్యూఢిల్లీ: అత్యుత్తమ కార్పొరేట్ నిర్వహణే లక్ష్యంగా మార్కెట్ రెగ్యులేటర్ సెబీ తాజా నియమావళిని నోటిఫై చేసింది. దీని ప్రకారం ఇకపై టాప్ 500 లిస్టెడ్ కంపెనీలు అన్నీ వార్షిక ప్రాతిపదికన వ్యాపార బాధ్యతల నిర్వహణా (బీఆర్) నివేదికలను తయారు చేయాల్సి ఉంటుంది. పర్యావరణం, వాటా దారులతో సంబంధాలు, సామాజిక బాధ్యతల నిర్వహణ వంటి అంశాలను వీటిలో పొందుపరచాలి.